తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  గుడ్​ న్యూస్​.. పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

గుడ్​ న్యూస్​.. పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ తగ్గించిన ఆ రాష్ట్ర ప్రభుత్వం

HT Telugu Desk HT Telugu

22 May 2022, 19:58 IST

google News
  • Petrol Diesel price | పెట్రోల్​, డీజిల్​పై సుంకాలు తగ్గించిన రాష్ట్రాల జాబితాలో తాజాగా మహారాష్ట్ర కూడా చేరింది. . రాష్ట్రంలో లీటరు పెట్రోల్​పై రూ. 2.08, లీటరు డీజిల్​పై రూ. 1.44 తగ్గిస్తున్నట్టు.. శివసేన ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది.

పెట్రోల్​, డీజిల్​పై సుంకాన్ని తగ్గించిన మరో రాష్ట్రం
పెట్రోల్​, డీజిల్​పై సుంకాన్ని తగ్గించిన మరో రాష్ట్రం (PTI)

పెట్రోల్​, డీజిల్​పై సుంకాన్ని తగ్గించిన మరో రాష్ట్రం

Petrol Diesel price | పెట్రోల్​, డీజిల్​పై కేంద్రం శనివారం వ్యాట్​ తగ్గించగా.. ఆ జాబితాలోకి రాష్ట్ర ప్రభుత్వాలు సైతం చేరుతున్నాయి. రాజస్థాన్​, కేరళ ప్రభుత్వాలు.. పెట్రోల్,​ డీజిల్​పై సుంకాన్ని తగ్గిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించాయి. తాజాగా.. ఈ జాబితాలోకి మహారాష్ట్ర కూడా చేరింది. రాష్ట్రంలో లీటరు పెట్రోల్​పై రూ. 2.08, లీటరు డీజిల్​పై రూ. 1.44 తగ్గిస్తున్నట్టు.. శివసేన ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. దీంతో తమకు రూ. 2,500కోట్ల మేర నష్టం కలుగుతుందని వెల్లడించింది.

మహారాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంతో ముంబైలో లీటరు పెట్రోల్​ రూ. 109.27కు, లీటరు డీజిల్​ 95.84కు చేరింది.

తమిళనాడు 'నో'...!

పెట్రోల్​, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించే యోచనలో లేనట్టు తమిళనాడు ప్రభుత్వం సంకేతాలిచ్చింది. పన్నులు పెంచే సమయంలో ప్రభుత్వాలను కేంద్రం సంప్రదించలేదని, రాష్ట్రానికి ఇప్పటికే రూ. 1000కోట్ల నష్టం వాటిల్లిందని పేర్కొంది. వ్యాట్​ రూపంలో కేంద్రానికి ఆదాయం చాలా రెట్లు పెరిగిందని, రాష్ట్రాల పరిస్థితి మాత్రం దారుణంగా ఉందని వెల్లడించింది.

మరోవైపు వ్యాట్​ను తగ్గించే అంశాన్ని పరిశీలిస్తామని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్​ బొమ్మై తెలిపారు. మధ్యప్రదేశ్​ ప్రభుత్వం సైతం సుంకాలను తగ్గించాలని విపక్షాల నుంచి డిమాండ్లు పెరుగుతున్నాయి.

రాష్ట్రానికి రావాల్సిన నిధులు.. తమకు అందిన తర్వాత.. పెట్రోల్​, డీజిల్​పై సుంకాలను తగ్గించే ఆలోచనలు చేస్తామని పశ్చిమ్​ బెంగాల్​ తేల్చిచెప్పింది.

ఈ వ్యవహారంపై కాంగ్రెస్​ సీనియర్​ నేత పీ. చిదంబరం స్పందించారు. 'రాష్ట్రాలకు ఇప్పటికే కేంద్రం చాలా తక్కువ నిధులు ఇస్తోంది. మరి వ్యాట్​ తగ్గించేందుకు రాష్ట్రాలు ముందుకొస్తాయో లేదో వేచి చూడాలి,' అని అనుమానం వ్యక్తం చేశారు.

కేంద్రం అనూహ్య నిర్ణయం..

Petrol Diesel price today | దేశ ప్ర‌జ‌ల‌పై పెను భారంగా ప‌రిణ‌మించిన పెట్రో ధ‌ర‌ల‌ను త‌గ్గించే దిశ‌గా కేంద్ర ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది. పెట్రోలు, డీజిల్‌ల‌పై ఎక్సైజ్ పన్నును గ‌ణ‌నీయంగా త‌గ్గించింది. పెట్రోలుపై లీట‌రుకు రూ. 8, డీజిల్‌పై లీట‌రుకు గ‌రూ. 6 ల మేర‌కు ఎక్సైజ్ ప‌న్నును త‌గ్గించింది. ఈ మేర‌కు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మ‌ల సీతారామ‌న్ శ‌నివారం ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నిర్ణ‌యం కార‌ణంగా ప్ర‌భుత్వంపై సంవ‌త్స‌రానికి రూ. ల‌క్ష కోట్ల భారం ప‌డ‌నుంద‌ని వెల్ల‌డించారు.

పెట్రో ధ‌ర‌ల కార‌ణంగా ద్ర‌వ్యోల్బ‌ణం కూడా క‌ట్ట‌డి చేయ‌లేని స్థాయికి పెరుగుతున్న నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణ‌యం తీసుకుంది. ఎక్సైజ్ ప‌న్ను త‌గ్గింపుతో పెట్రోలు ధ‌ర లీట‌రుకు రూ. 9.50, డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 7 వ‌ర‌కు త‌గ్గనుంది. అంటే, ఢిల్లీలో ఆదివారం నుంచి పెట్రోలు ధ‌ర లీట‌రుకు రూ. 95.91గా, డీజిల్ ధ‌ర లీట‌రుకు రూ. 89.67గా ఉండ‌నుంది. ప్ర‌స్తుతం ఢిల్లీలో లీట‌రు పెట్రోలు రూ. 105.41గా, లీట‌రు డీజిల్ రూ. 96.67గా ఉంది.

టాపిక్

తదుపరి వ్యాసం