తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Sharad Pawar On Brs : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

Sharad Pawar On BRS : బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సంచలన వ్యాఖ్యలు

17 June 2023, 19:04 IST

google News
    • Sharad Pawar On BRS : బీఆర్ఎస్ తొలిఅడుగు మహారాష్ట్రతో మొదలుపెట్టాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు మహారాష్ట్రలో బీఆర్ఎస్ స్పీడు పెంచింది. ఎన్సీపీ అధినేత శరద్ పవార్.. బీఆర్ఎస్ విస్తరణపై స్పందిస్తూ బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ అని ఆరోపించారు.
కేసీఆర్, శరద్ పవార్
కేసీఆర్, శరద్ పవార్

కేసీఆర్, శరద్ పవార్

Sharad Pawar On BRS : తెలంగాణ సీఎం కేసీఆర్... జాతీయ రాజకీయాలలో కీలక పాత్ర పోషించేందుకు డిసైడ్ అయ్యారు. ఈ నేపథ్యంలోనే టీఆర్ఎస్.. బీఆర్ఎస్ గా మార్పుచేశారు. బీఆర్ఎస్ ఏర్పడిన అనంతరం పలు రాష్ట్రాల్లో పర్యటించిన కేసీఆర్... రాజకీయ పర్యటనలు మాత్రం మహారాష్ట్రతో స్టార్ట్ చేశారు. తెలంగాణ సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్రలో ఇప్పటికే పలు బహిరంగసభలు నిర్వహించిన కేసీఆర్... చేరికలపైనా దృష్టిపెట్టారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు సీఎం కేసీఆర్ నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మహారాష్ట్రలో విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. మహారాష్ట్రలో రైతుల అభ్యున్నతి కోసం తెలంగాణ మోడల్‌ ను అమలుచేస్తామని కేసీఆర్ పదే పదే చెబుతున్నారు. పార్టీ ఎన్నికల వాగ్దానాల ప్రకారం, అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి నీటి సరఫరా చేస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు.

బీజేపీ-శివసేన కూటమిపై ప్రభావం

గురువారం మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్వస్థలమైన నాగ్‌పూర్‌లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూడా కేసీఆర్ ప్రారంభించారు. పార్టీ ఆశయాలను కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. ముంబయి, పూణె, ఔరంగాబాద్‌లలో కూడా పార్టీ కార్యాలయాలు త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. మహారాష్ట్రలోని భండారాలో బీఆర్ఎస్ పార్టీ మీటింగ్ కు చాలా మంది హాజరయ్యారు. నాందేడ్ జిల్లాలో బీఆర్ఎస్ మీటింగ్ కూడా భారీగా జనం తరలివచ్చారు. మరోవైపు మహారాష్ట్రలో బీఆర్‌ఎస్‌ విస్తరణపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) స్పందిస్తూ రాష్ట్రంలో బీజేపీ-శివసేన కూటమిపై కేసీఆర్ ప్రభావం ఉండదని చెబుతోంది.

కాంగ్రెస్, ఎన్సీపీలే టార్గెట్

అయితే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ మాత్రం బీఆర్‌ఎస్‌ను బీజేపీ ‘బీ టీమ్‌’గా అభివర్ణించారు. ప్రస్తుతం ఉత్తర మహారాష్ట్ర పర్యటనలో ఉన్న శరద్ పవార్ మాట్లాడుతూ.. కేసీఆర్ కేవలం కాంగ్రెస్, ఎన్సీపీలను మాత్రమే టార్గెట్ చేస్తున్నట్టు కనిపిస్తోందని అన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి చెందిన 'బీ' టీమ్ అని మాకు అనిపిస్తుందని పవార్ అన్నారు. కేసీఆర్ తన పార్టీని జాతీయ పార్టీగా చూపించడమే కాకుండా, మహారాష్ట్రలో బలపడేందుకు మొదటి ప్రయత్నంచేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నేతృత్వంలోని భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) మహారాష్ట్రలో అడుగుపెట్టడంపై స్పందిస్తూ... ఏ రాష్ట్రంలోనైనా తమ పార్టీని విస్తరించుకునే హక్కు అన్ని రాజకీయ పార్టీలకు ఉన్నప్పటికీ.. అయితే బీఆర్‌ఎస్.. బీజేపీ బీ టీమ్ కాదా అనేది చూడాలన్నారు. 2019 ఎన్నికల్లో ప్రకాష్ అంబేడ్కర్ వంచిత్ బహుజన్ అఘాడి (VBA) వల్ల కాంగ్రెస్-ఎన్‌సీపీ కూటమి ఓటమిని ఎదుర్కొందని పవార్ అన్నారు. నాగపూర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేసిన సీఎం కేసీఆర్ మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టంచేశారు.

తదుపరి వ్యాసం