తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  ఔరంగాబాద్ పేరు మార్చిన ఉద్దవ్ సర్కార్.. శంభాజీనగర్‌గా నామకరణం

ఔరంగాబాద్ పేరు మార్చిన ఉద్దవ్ సర్కార్.. శంభాజీనగర్‌గా నామకరణం

HT Telugu Desk HT Telugu

29 June 2022, 18:58 IST

    • సంక్షోభంలో పడిన ఉద్దవ్ సర్కార్ కేబినెట్ ఈ సాయంత్రం సమావేశమైంది. ఔరంగాబాద్, ఒస్మానాబాద్ నగరాల పేరు మార్చేసింది.
ఉద్దవ్ థాకరే
ఉద్దవ్ థాకరే (HT_PRINT)

ఉద్దవ్ థాకరే

మహారాష్ట్ర మంత్రి మండలి ఔరంగాబాద్ సిటీ పేరు మార్చేసింది. శంభాజీనగర్‌గా పేరు పెట్టింది. అలాగే ఒస్మానాబాద్ సిటీకి ధారాశివ్‌గా నామకరణం చేసింది.

ట్రెండింగ్ వార్తలు

‘‘వైవాహిక స్థితితో సంబంధం లేకుండా.. పరస్పర అనుమతితో లైంగిక సంబంధం తప్పు కాదు’’: ఢిల్లీ హైకోర్టు

CBSE Results 2024: సీబీఎస్ఈ రిజల్ట్స్ పై కీలక అప్ డేట్; 10వ తరగతి, 12 తరగతి పరీక్షల ఫలితాలు ఎప్పుడంటే?

CSIR UGC NET : సీఎస్​ఐఆర్​ యూజీసీ నెట్​ జూన్ 2024​ రిజిస్ట్రేషన్లు షురూ..

Politician affair : దత్త పుత్రుడితో బెడ్​ మీద ప్రముఖ రాజకీయ నేత- నగ్నంగా భర్తకు దొరికిపోయి..

రేపు విశ్వాస పరీక్ష ఎదుర్కోవాల్సి ఉండగా ఆకస్మికంగా సమావేశమైన ఉద్దవ్ థాకరే మంత్రిమండలి ఈ సంచలన నిర్ణయాలు తీసుకుంది.

మరోవైపు విశ్వాస పరీక్షకు నిలబడాలంటూ గవర్నర్ ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ శివసనే చీఫ్ విప్ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం కోర్టు ఈ సాయంత్రం 5 గంటల నుంచి విచారణ జరుపుతోంది.

విచారణలో సునీల్ ప్రభు తరపున అభిషేక్ మను సింఘ్వీ, రెబల్ ఎమ్మెల్యేల తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపిస్తున్నారు.

టాపిక్