Valentine's Day 2024 special: ఈ రోజు గూగుల్ డూడుల్ చూశారా?.. ఇది వాలంటైన్స్ డే స్పెషల్
14 February 2024, 10:13 IST
Valentine's Day 2024 special ఈ రోజు వాలంటైన్స్ డే.. ప్రేమికులకే ప్రత్యేకమైన స్పెషల్ డే. ఈ వాలంటైన్స్ డే స్పెషల్ గా గూగుల్ కూడా ప్రత్యేకమైన డూడుల్ ను రూపొందించింది. లవ్ ను కెమిస్ట్రీతో వివరిస్తూ, ఈ ప్రేమికుల రోజున వినూత్న డూడుల్ ను రూపొందించింది.
వాలంటైన్స్ డే స్పెషల్ గూగుల్ డూడుల్
Valentine's Day Google Doodle: వాలెంటైన్స్ డే వచ్చిందంటే చాలు ప్రేమ వార్తల్లో నిలుస్తోంది. ప్రపంచ సాహిత్యంలో ప్రేమ సాహిత్యానిది ప్రత్యేక స్థానం. ముఖ్యంగా వాలంటైన్స్ డే కు దాదాపు ఒక వారం ముందు నుంచీ వాతావరణం అంతా ప్రేమమయంగా మారుతుంది. సాధారణంగా, ప్రేమ అనే హ్యూమన్ ఎమోషన్ ను మించిన ఆసక్తికరమైన అంశం మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. కానీ ఆకర్షణ, రొమాన్స్, క్రష్, ప్రేమ అనే భావాలకు కారణమయ్యేది హార్మోన్లు, రసాయనాలేనని ఇప్పుడు రుజువైంది. ఉత్సాహభరితమైన అనుభూతి, తీవ్రమైన భావోద్వేగాలు లోతైన అనుబంధం.. మొదలైనవి డోపమైన్, ఆక్సిటోసిన్, ఆడ్రినలిన్ వంటి హార్మోన్ల స్రావానికి కారణం కావచ్చు. ఈ సంవత్సరం వాలెంటైన్స్ డే రోజు గూగుల్ డూడుల్ లో ప్రేమ భావన వెనుక దాగిన శాస్త్రీయ కారణాలను, రొమాన్స్ కు ప్రేరేపించే కెమిస్ట్రీని వివరించారు.
గూగుల్ డూడుల్ గేమ్
ఈ వాలెంటైన్స్ డే రోజు కెమిస్ట్రీ సీయూపీడీ (Chemistry CuPd) పేరుతో ఒక ఆట ఆడే అవకాశాన్ని గూగుల్ డూడుల్ కల్పించింది. దీనిలో మీరు ఆవర్తన పట్టిక (periodic table) నుండి ఒక అవతార్ ను ఎంచుకోండి. మీ వ్యక్తిత్వానికి బాగా సరిపోయే క్విజ్ తీసుకోండి. ఈ వాలంటైన్స్ డే ను ఈ గేమ్ ఆడి, వినూత్నంగా ప్రారంభించండి. ప్రేమను ప్రేరేపించే రసాయన మూలకాలను వివరించే ఈ సరదా డూడుల్ ను క్లిక్ చేయండి.
‘‘రెండు పరమాణువులు ఒకదానినొకటి ఆకర్షించుకుని ద్వి పరమాణు అణువులు తయారవుతాయి. కొన్నిసార్లు ఇది హెచ్ 2 (హైడ్రోజన్) వంటి ఒకే మూలకం మధ్య బంధం కూడా కావచ్చు’’ అని గూగుల్ డూడుల్ ను వివరిస్తూ పోస్ట్ చేశారు. ఆసక్తి ఉన్నవారు ఈ గూగుల్ డూడుల్ క్విజ్ లో కూడా పార్టిసిపేట్ చేయవచ్చు.
వారం ముందు నుంచే ఉత్సవాలు
ఈ ప్రేమ ఉత్సవాలు ఒక్క ఫిబ్రవరి 14వ తేదీకి మాత్రమే పరిమితం కాదు. వీటిని ప్రేమికులు కనీసం వారం రోజుల పాటు జరుపుకుటారు. ఇవి రోజ్ డే తో ప్రారంభమై, కిస్ డేతో ముగుస్తాయి. ఈ వాలంటైన్ వీక్ లో రోజ్ డే (ఫిబ్రవరి 7), ప్రపోజ్ డే (ఫిబ్రవరి 8), చాక్లెట్ డే (ఫిబ్రవరి 9), టెడ్డీ డే (ఫిబ్రవరి 10), ప్రామిస్ డే (ఫిబ్రవరి 11), హగ్ డే (ఫిబ్రవరి 12), కిస్ డే (ఫిబ్రవరి 13) ఉంటాయి. వాలెంటైన్స్ డే ప్రపంచవ్యాప్తంగా విస్తృతంగా ప్రాచుర్యం పొందిన వేడుకగా మారింది. కొంతమంది తమ ప్రత్యేకమైన వ్యక్తి సాంగత్యంతో సంతృప్తి చెందుతుంటే, మరికొందరు దీనిని సరదా కార్యకలాపాలు, సాహసాలు చేయడానికి అవకాశంగా మారుస్తారు. చేతితో తయారుచేసిన బహుమతులను రూపొందించడం నుండి, వారి భాగస్వాములతో మరచిపోలేని జ్ఞాపకాలను సృష్టించడానికి థీమ్ ఈవెంట్లను నిర్వహించడం వరకు, ప్రేమికుల రోజున మీరు చేయగలిగేవి చాలా ఉన్నాయి.