London to NewYork: జస్ట్ గంటన్నరలో లండన్ నుంచి న్యూయార్క్ కు; సూపర్ సోనిక్ జర్నీ
26 August 2023, 15:28 IST
London to NewYork: అమెరికాలోని న్యూయార్క్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు జస్ట్ గంటన్నరలో వెళ్లే సూపర్ సోనిక్ విమానాన్ని నాసా డెవలప్ చేస్తోంది. మాక్ 2 నుంచి మాక్ 4 మధ్య వేగంతో వెళ్లే ఈ సూపర్ సోనిక్ ఫ్లైట్ ద్వారా 90 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవచ్చు.
ప్రతీకాత్మక చిత్రం
London to NewYork: అమెరికాలోని న్యూయార్క్ నుంచి బ్రిటన్ రాజధాని లండన్ కు జస్ట్ గంటన్నరలో వెళ్లే సూపర్ సోనిక్ విమానాన్ని నాసా డెవలప్ చేస్తోంది. మాక్ 2 నుంచి మాక్ 4 మధ్య వేగంతో వెళ్లే ఈ సూపర్ సోనిక్ ఫ్లైట్ ద్వారా 90 నిమిషాల్లో లండన్ నుంచి న్యూయార్క్ చేరుకోవచ్చు.
5586 కిలోమీటర్లు..
లండన్ నుంచి న్యూయార్క్ కు 5586 కిమీ లు లేదా 3,471 మైళ్ల దూరం ఉంటుంది. సాధారణంగా నాన్ స్టాప్ విమానాల్లో లండన్ నుంచి న్యూయార్క్ వెళ్లడానికి కనీసం 8 నుంచి 9 గంటల సమయం పడ్తుంది. వాటి వేగం సుమారు గంటకు 600 మైళ్లుగా ఉంటుంది. కానీ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా (NASA).. డెవలప్ చేస్తున్న సరికొత్త సూపర్ సోనిక్ ఫ్లైట్ ‘ఎక్స్59 (X-59)’ అందుబాటులోకి వస్తే.. లండన్ నుంచి న్యూయార్క్ కు జస్ట్ గంటన్నరలో వెళ్లిపోవచ్చు. క్వెస్ట్ మిషన్ లో భాగంగా నాసా ఈ సూపర్ సోనిక్ విమానాలను సిద్ధం చేస్తోంది. ఈ సూపర్ సోనిక్ ఫ్లైట్ వేగం మాక్ 2 నుంచి మాక్ 4 మధ్య ఉంటుంది. అంటే గంటకు 1,545 మైళ్ల నుంచి 3,045 మైళ్ల వేగం అన్నమాట. ఈ సూపర్ సోనిక్ ఫ్లైట్ కు నాసా ఎక్స్ 59 (X-59) అనే పేరు పెట్టింది.
గంటకు 3 వేల మైళ్ల వేగం..
భవిష్యత్తులో మాక్ 4 అంటే గంటకు 3 వేల పై చిలుకు మైళ్ల వేగంతో కమర్షియల్ విమానాలను నడిపే సాధ్యాసాధ్యాలపై నాసా ప్రస్తుతం అధ్యయనం చేస్తోంది. ఇందుకోసం ప్రపంచవ్యాప్తంగా 50 విమాన మార్గాలను గుర్తించింది. ప్రస్తుతం అమెరికా సహా చాలా దేశాలు తమ గగన తలంపై సూపర్ సోనిక్ విమానాల రాకపోకలను నిషేధించాయి. ఇందుకు శబ్ధ కాలుష్యాన్ని ప్రధాన కారణంగా చెప్పాయి. అందువల్ల తాము రూపొందిస్తున్న సూపర్ సోనిక్ విమానాలు చేసే శబ్ధాన్ని గణనీయంగా తగ్గించడానికి నాసా కృషి చేస్తోంది. మరోవైపు, ప్రయాణికుల భద్రతను కూడా దృష్టిలో పెట్టుకుంటోంది.