తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Live News Today : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‌లోకి నిరసనకారులు
లేటెస్ట్ న్యూస్
లేటెస్ట్ న్యూస్ (AP)

Live news today : పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్టు: ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‌లోకి నిరసనకారులు

09 May 2023, 22:45 IST

  • Live news today : నేటి జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్​ వార్తల కోసం ఈ హెచ్​టీ తెలుగు లైవ్​ పేజ్​ను ఫాలో అవ్వండి.

09 May 2023, 22:45 IST

పాకిస్థాన్‍లో కొనసాగుతున్న ఆందోళనలు: సోషల్ మీడియా బ్లాక్

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు నిరసనగా పాకిస్థాన్‍లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో నిరసనలు హింసాత్మకమవుతున్నాయి. ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‌లోకి నిరసనకారులు దూసుకెళ్లారు. కాగా, ఇస్లామాబాద్ సహా దేశంలోని కొన్ని ప్రాంతాల్లో ట్విట్టర్ సహా మిగిలిన సోషల్ మీడియా  ప్లాట్‍ఫామ్‍లను బ్లాక్ చేసింది పాక్ ప్రభుత్వం. చాలా ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది. 

09 May 2023, 21:50 IST

ఈ నెలలో మోదీ-బైడెన్ భేటీ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఈ నెలలో సమావేశం కానున్నారు. పసిఫిక్ ఐల్యాండ్స్ లీడర్స్ సదస్సుకు హాజరుకానున్న ఈ ఇద్దరు నేతలు భేటీ కానున్నారు. 

09 May 2023, 21:12 IST

గ్యాలెంటరీ అవార్డులు ప్రదానం చేసిన రాష్ట్రపతి

విధుల్లో విశేష సేవలు చేసిన, ధైర్య సాహసాలు కనబరిచిన సైనిక, పోలీసు అధికారులకు గ్యాలెంటరీ అవార్డులను రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము ప్రదానం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‍లో ఈ కార్యక్రమం జరిగింది. 

09 May 2023, 19:59 IST

ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‌లోకి నిరసనకారులు

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ అరెస్టును నిరసిస్తూ ఆ దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి. కొందరు నిరసనకారులు రావల్పిండిలోని ఆర్మీ హెడ్‍క్వార్టర్స్‌లోకి ప్రవేశించారని తెలుస్తోంది. ఆర్మీ కామాండర్ల ఇళ్ల కాంపౌడ్లను దాటి వెళుతున్నారని సమచారం. 

09 May 2023, 19:42 IST

పాట పాడిన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ

విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా కోల్‍కతాలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాట పాడారు. వేదికపై లయబద్ధంగా పాట పాడారు.  

09 May 2023, 19:09 IST

పోకో ఎఫ్5 5జీ వచ్చేసింది

Poco F5 5G: పోకో ఎఫ్5 5జీ ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. రూ.29,999 ప్రారంభ ధరతో విడుదలైంది. ఈ మొబైల్ పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, ఆఫర్ల వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

09 May 2023, 18:37 IST

పాకిస్థాన్‍లో నిరసనలు

పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్‍ను అరెస్టు చేయడం పట్ల పీటీఐ పార్టీ శ్రేణులు, ఆయన మద్దతుదారులు ఆందోళనలు చేస్తున్నారు. పాకిస్థాన్ వ్యాప్తంగా నిరనసలు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

09 May 2023, 18:18 IST

‘ది కేరళ స్టోరీ’ సినిమాకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ

ది కేరళ స్టోరీ సినిమాను చూసేందుకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. ఢిల్లీలోని చాణక్యపురిలో ఓ థియేటర్‌కు చేరుకున్నారు. ఈ సినిమాను పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిషేధించగా.. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్ మాత్రం పన్ను మినహాయింపు కల్పించింది. 

09 May 2023, 18:02 IST

ఈనెల 15న ఒప్పో ఎఫ్23 5జీ విడుదల

ఒప్పో ఎఫ్23 5జీ ఫోన్ ఈ నెల 15వ తేదీన ఇండియాలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని ఒప్పో అధికారికంగా ప్రకటించింది. 

09 May 2023, 17:42 IST

సీఎం కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా మాజీ సీఎస్ సోమేశ్ కుమార్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాన సలహాదారుడిగా మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Ex CS) సోమేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆయనను కేసీఆర్ నియమించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పదవిలో సోమేశ్ కుమార్ మూడు సంవత్సరాల కాలం పాటు కొనసాగనున్నారు.

09 May 2023, 17:36 IST

సొంత పార్టీ సీఎంపై సచిన్ పైలట్ మాటలదాడి

రాజస్థాన్ కాంగ్రెస్‍లో ముసలం మరింత ముదురుతోంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‍కు లీడర్ బీజేపీకి చెందిన వసుంధర రాజేలా అనిపిస్తోందని కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ అన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అయిన గహ్లోత్, పైలట్ మధ్య కొన్నేళ్లుగా ఈ అంతర్గత యుద్ధం నడుస్తూనే ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూలకుండా బీజేపీ నేతలు ముగ్గురు సహకరించారని సీఎం గహ్లోత్ ఇటీవల అనటం సంచలనంగా మారింది. 

09 May 2023, 17:13 IST

మమతా బెనర్జీకి నోటీసులు పంపిన దర్శకుడు

Vivek Agnihotri sends notice to Mamata Banerjee: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి లీగల్ నోటీసులు పంపారు దర్శకుడు వివేక్ అగ్మిహోత్రి. కశ్మీర్ ఫైల్స్ సినిమా ఓ వర్గాన్ని కించపరిచిందని మమత అన్నారు. ది కేరళ స్టోరీ చిత్రాన్ని బ్యాన్ చేస్తున్నట్టు ప్రకటిస్తున్న సందర్భంగా కశ్మీర్ ఫైల్స్ అంశాన్ని ఆమె లేవనెత్తారు. దీంతో మమతకు లీగల్ నోటీసులు పంపారు కశ్మీర్ ఫైల్స్ సినిమా దర్శకుడు వివేక్. తనను, తన సినిమాను ఆమె కించపరిచారని అన్నారు. 

09 May 2023, 16:55 IST

గూగుల్ సీఈవోను కలిసిన కేంద్ర మంత్రి

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్‍ను కేంద్ర మంత్రి ఐటీ, టెలికం, రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కలిశారు. కాలిఫోర్నియాలోని గూగుల్ హెడ్ క్వార్టర్స్‌లో పిచాయ్‍తో ఆయన ముచ్చటించారు. 

09 May 2023, 16:12 IST

బస్సు ప్రమాదంలో 23కు చేరిన మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్‍లోని ఖర్గోన్‍లో సంభవించిన బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య 23కు చేరింది. 20 మందికి పైగా గాయడ్డారు. ఓ వంతెనపై నుంచి బస్సు అదుపు తప్పి పడిపోవటంతో ఈ ప్రమాదం జరిగింది.  వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

09 May 2023, 15:11 IST

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్!

Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధాని, పాకిస్థాన్ తెహ్రికే ఇన్సాఫ్ (PTI) అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ అయ్యారు. ఇస్లామాబాద్ హైకోర్టు పరిసరాల్లో ఇమ్రాన్‍ను పోలీసులు అరెస్ట్ చేసినట్టు పాకిస్థాన్ మీడియా సంస్థ డాన్ రిపోర్ట్ చేసింది. ఈ విషయాన్ని న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ ట్వీట్ చేసింది. 

09 May 2023, 14:55 IST

రాజస్థాన్‍లో మోదీ పర్యటన రేపు

రాజస్థాన్‍లో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు (మే 10) పర్యటించనున్నారు. సుమారు రూ.5,500 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ ఏడాది చివర్లో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. 

09 May 2023, 14:24 IST

ఐపీఎల్ నుంచి జోఫ్రా ఆర్చర్ ఔట్

IPL 2023 - Jofra Archer: ఐపీఎల్ 2023 టోర్నీ నుంచి ముంబై ఇండియన్స్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ వైదొలిగాడు. గాయం కారణంగా ఈ ఏడాది ఐపీఎల్‍లో మిగిలిన మ్యాచ్‍లకు అతడు అందుబాటులో ఉండడని ముంబై ఇండియన్స్ పేర్కొంది. దీంతో స్వదేశమైన ఇంగ్లండ్‍కు ఆర్చర్ ‍వెళ్లనున్నాడు. ఆర్చర్ స్థానంలో ఇంగ్లండ్‍కే చెందిన క్రిస్ జోర్డాన్‍ను ముంబై ఇండియన్ రిప్లేస్‍మెంట్‍గా తీసుకుంది. 

09 May 2023, 13:38 IST

బ్యాంక్​ ఆఫ్​ బరోడాలో జాబ్స్

20 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ను విడుదల చేసింది బ్యాంక్​ ఆఫ్​ బరోడా. ఈ నెల 11, అంటే గురువారంతో అప్లికేషన్​ తేదీ ముగియనుంది. ఈ నేపథ్యంలో నోటిఫికేషన్​కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

09 May 2023, 13:01 IST

కియా సోనెట్​ కొత్త వేరియంట్​..

కియా సోనెట్​ నుంచి యానివర్సీ ఎడిషన్​ ‘ఓరాక్స్​’ లాంచ్​ అయ్యింది. ఈ కొత్త వేరియంట్​ ఫీచర్స్​, ధర వంటి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

09 May 2023, 12:32 IST

మధ్యప్రదేశ్​ బస్సు ప్రమాదం..

మధ్యప్రదేశ్​లో మంగళవారం ఉదయం ఘోర ప్రమాదం సంభవించింది. 50 ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు.. ఖర్గోన్​ ప్రాంతంలోని ఓ వంతెనపై నుంచి కిందపడిపోయింది. ఈ ఘటనలో 22మంది ప్రాణాలు కోల్పోయారు. 20మందికిపైగా ప్రజలు గాయపడ్డారు. ఈ వివరాలను ఆ రాష్ట్ర హోంమంత్రి నరోత్తమ్​ మిశ్రా వెల్లడించారు.

09 May 2023, 11:26 IST

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం

మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. 40మంది ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సు ఖర్గోన్​ ప్రాంతంలోని బ్రిడ్జ్​ మీద నుంచి పడిపోయింది. ఈ ఘటనలో 15మంది ప్రాణాలు కోల్పోయారు.

09 May 2023, 11:06 IST

రేపే కర్ణాటక ఎన్నికలు..

దేశ రాజకీయాల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది! కర్ణాటకలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఓటింగ్​కు సంబంధించిన వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

09 May 2023, 10:28 IST

కొవిడ్​ కేసులు..

ఇండియాలో కొత్తగా 1,331 కొవిడ్​ కేసులు వెలుగులోకి వచ్చాయి. 3,752మంది రికవరీ అయ్యారు. యాక్టివ్​ కేసుల సంఖ్య 22,742కు చేరింది.

09 May 2023, 10:00 IST

కేరళ స్టోరీకి పన్ను మినహాయింపు

వివాదాస్పద చిత్రం ది కేరళ స్టోరీకి.. యూపీ ప్రభుత్వం పన్ను మినహాయింపును ఇచ్చింది. బెంగాల్​లో ఈ చిత్రాన్ని నిషేదిస్తున్నట్టు ప్రకటన వెలువడిన కొన్ని గంట్లోనే యూపీ ప్రభుత్వం  ఈ నిర్ణయం తీసుకోవడం వార్తలకెక్కింది.

09 May 2023, 9:33 IST

లాభాలు.. నష్టాలు..

హెచ్​యూఎల్​, ఎం అండ్​ ఎం, హెచ్​డీఎఫ్​సీ, ఐటీసీ, యాక్సిస్​ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​, టైటాన్​ షేర్లు లాభాల్లో ఉన్నాయి.

అల్ట్రాటెక్​ సిమెంట్​, ఎన్​టీపీసీ, హెచ్​సీఎల్​ టెక్​, ఏషియన్​ పెయింట్స్​ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09 May 2023, 9:17 IST

ఫ్లాట్​గా దేశీయ సూచీలు..

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను ఫ్లాట్​గా ప్రారంభించాయి. బీఎస్​ఈ సెన్సెక్స్​ 104 పాయింట్ల లాభంతో 61,869 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ నిఫ్టీ.. 35 పాయింట్లు పెరిగి 18,299 వద్ద ట్రేడ్​ అవుతోంది.

09 May 2023, 9:04 IST

కేరళ స్టోరీ సిబ్బందికి భద్రత పెంపు..

వివాదాస్పద కేరళ స్టోరీ చిత్ర బృందంలోని ఒకరికి భద్రతను కల్పిస్తున్నట్టు ముంబై పోలీసులు తెలిపారు. సిబ్బందిలో ఒకరికి బెదురింపులు రావడంతో ఈ చర్యలు చేపట్టారు.

09 May 2023, 8:32 IST

ఐకూ నియో 8..

ఐకూ నుంచి నియో 8 సిరీస్​ త్వరలోనే లాంచ్​ అవుతున్నట్టు సమాచారం. ఇందులో నియో 8, నియో 8 ప్రో మోడల్స్​ ఉంటాయని తెలుస్తోంది.

09 May 2023, 8:14 IST

పేపర్​ లీక్​ కేసులో..

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పేపర్‌ లీక్ కేసులో మరో ఇద్దరిని సిట్‌ దర్యాప్తు బృందం అరెస్టు చేసింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన ప్రవీణ్‌, ఏఈ, ఏఈఈ ప్రశ్నాపత్రాలను కూడా విక్రయించినట్టు తాజాగా బయటపడింది.

09 May 2023, 8:00 IST

తెలంగాణ ఎంసెట్​..

తెలంగాణ ఎంసెట్‌ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 10 నుంచి 14వ తేదీ వరకు ఎంసెట్‌ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎంసెట్ కన్వీనర్ ప్రకటించారు.

09 May 2023, 7:59 IST

స్టాక్​ మార్కెట్​లకు నెగిటివ్​ ఓపెనింగ్​..!

దేశీయ స్టాక్​ మార్కెట్​లు మంగళవారం ట్రేడింగ్​ సెషన్​ను నష్టాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. ఎస్​జీఎక్స్​ నిఫ్టీ 30 పాయింట్ల నష్టంలో ఉండటం ఇందుకు కారణం.

అంతర్జాతీయంగా సానుకూల పవనాల మధ్య దేశీయ స్టాక్​ మార్కెట్​లు సోమవారం ట్రేడింగ్​ సెషన్​లో భారీగా లాభపడ్డాయి. నిఫ్టీ50.. 1.08శాతం పెరిగి 18,264 వద్ద ముగిసింది. బీఎస్​ఈ సెన్సెక్స్​ 1.16శాతం వృద్ధి చెంది 61,764 వద్ద స్థిరపడింది. బ్యాంక్​ నిఫ్టీ 622 పాయింట్ల లాభంతో 43,284 వద్దకు చేరింది.

09 May 2023, 7:58 IST

మళ్లీ పెరిగిన పసిడి ధరలు..

దేశంలో బంగారం ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 110 పెరిగి.. రూ. 56,600కి చేరింది.

దేశంలో వెండి ధరలు మంగళవారం స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,810గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 400 పెరిగి, రూ. 78,100గా కొనసాగుతోంది.

    ఆర్టికల్ షేర్ చేయండి