Karnataka elections 2023 : కర్ణాటకలో రేపే ఎన్నికలు.. టైమింగ్స్​, ఇతర వివరాలు..-karnataka elections 2023 vote timings key constituencies check other details ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Elections 2023 : కర్ణాటకలో రేపే ఎన్నికలు.. టైమింగ్స్​, ఇతర వివరాలు..

Karnataka elections 2023 : కర్ణాటకలో రేపే ఎన్నికలు.. టైమింగ్స్​, ఇతర వివరాలు..

Sharath Chitturi HT Telugu
May 09, 2023 10:32 AM IST

Karnataka election 2023 : దేశ రాజకీయాల్లో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది! కర్ణాటకలో రేపు ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లును పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో ఓటింగ్​కు సంబంధించిన వివరాలు తెలుసుకుందాము..

రేపే కర్ణాటక ఎన్నికలు..
రేపే కర్ణాటక ఎన్నికలు.. (Narendra Modi Twitter)

Karnataka elections 2023 : కర్ణాటకలో హైఓల్టేజ్​ ప్రచారాలకు తెరపడింది. ఇక అసెంబ్లీ ఎన్నికల పోలింగ్​ కోసం రాష్ట్రం సన్నద్ధమవుతోంది. రాష్ట్రంలోని 224 అసెంబ్లీ స్థానాలకు బుధవారం పోలింగ్​ జరగనుంది. గెలుపుపై ప్రధాన పార్టీలన్నీ ధీమాగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో 2023 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్​ టైమింగ్స్​, కీలక నియోజకవర్గాలు వంటి వివరాలను ఇక్కడ తెలుసుకుందాము..

కర్ణాటకలో పోలింగ్​..

కర్ణాటక ఎన్నికల కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఓటింగ్​ కోసం.. రాష్ట్రవ్యాప్తంగా 58,282 పోలింగ్​ స్టేషన్లను సిద్ధం చేసింది. వీటిల్లో 1,320​ కేంద్రాలను మహిళా అధికారులు నిర్వహించనున్నారు. స్టేషన్​కు సగటున 883 మంది ప్రజలు ఓట్లు వేయనున్నారు. సాధారణంగా ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5-6 గంటల వరకు పోలింగ్​ను నిర్వహిస్తుంది ఈసీ.

Karnataka elections 2023 schedule : కర్ణాటక అసెంబ్లీలో 224 సీట్లున్నాయి. మేజిక్​ ఫిగర్​ 113 సీట్లుగా ఉంది. రాష్ట్రంలో 5.24కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 5.60లక్షల మంది దివ్యాంగులు ఉన్నారు.

కర్ణాటకలోని మొత్తం ఓటర్లలో 17శాతం లింగాయత్​లు, 15శాతం మంది వొక్కలిగాలు, 35శాతం మంది ఓబీసీలు, 18శాతం ఎస్​సీ/ఎస్​టీలు, 12.92శాతం ముస్లింలు, 3శాతం బ్రహ్మణులు ఉన్నారు.

Karnataka elections 2023 results : మొత్తం 224 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లింగాయత్​లకు 100కుపైగా సీట్లపై పట్టు ఉంది! ప్రస్తుతం ఉన్న అసెంబ్లీలో 54మంది లింగాయత్​ ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో 37మంది బీజేపీ ఎమ్మెల్యేలే! 1952 నుంచి కర్ణాటకలో 23మంది సీఎంలుగా బాధ్యతలు స్వీకరించారు. వీరిలో 10మంది లింగాయత్​లే కావడం గమనార్హం.

ఇదీ చూడండి:- Who is Next CM of Karnataka : కర్ణాటకలో తదుపరి సీఎం ఎవరు? సర్వత్రా ఉత్కంఠ!

కీలక స్థానాలు.. కీలక అభ్యర్థులు..

షిగ్గావ్​:- బీజేపీ అభ్యర్థి- బసవరాజ్​ బొమ్మై. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్​ అభ్యర్థి సయ్యెద్​ అజీమ్​పీర్​ ఖదారీపై 9వేలకుపైగా ఓట్ల మెజారిటీతో గెలిచారు.

వరుణ:- కాంగ్రెస్​ అభ్యర్థి:- సిద్ధరామయ్య. 2008, 2013లో మాజీ సీఎం సిద్ధరామయ్య ఇక్కడ గెలిచారు. 2018లో ఆయన తనయుడు యథీంద్ర గెలుపొందారు. ఇప్పుడ మళ్లీ వరుణ నుంచే పోటీ చేస్తున్నారు సిద్ధరామయ్య.

Congress Karnataka elections : కనకపుర:- కాంగ్రెస్​ అభ్యర్థి- డీకే. శివకూమార్​. పీసీసీ అధ్యక్షుడు శివకుమార్​ 2008 నుంచి ఇక్కడ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 2018 ఎన్నికల్లో జేడీఎస్​ అభ్యర్థి నారాయణ గౌడపై దాదాపు 80వేలకుపైగా ఓట్ల తేడాతో గెలుపొందారు.

చన్నపట్నా:- జేడీఎస్​ అభ్యర్థి- హెజ్​డీ కుమారస్వామి. 2018 ఎన్నికల్లో ఆయన 21,530 ఓట్ల మెజారిటీతో ఇక్కడ గెలిచారు.

షికారిపుర:- బీజేపీ అభ్యర్థి- బీవై విజయేంద్ర. ఈయన మాజీ సీఎం, బీజేపీ కీలక నేత బీఎస్​ యడియూరప్ప తనయుడు. 1983 నుంచి రెండు సార్లు మినహాయిస్తే.. ఈ సీటులో బీజేపీ విజయం సాధిస్తూ వస్తోంది.

గత ఎన్నికల్లో..

Karnataka election results : 2018లో జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ బలపరీక్షలో ఓడిపోవడంతో ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం.. కాంగ్రెస్​- జేడీఎస్​లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. కొన్ని సంవత్సరాల తర్వాత.. ఎమ్మెల్యేలు బీజేపీకి వలస వెళ్లిపోవడంతో.. మెజారిటీని కోల్పోయి ప్రభుత్వం కుప్పకూలింది. ఈ విధంగా బీజేపీ తిరిగి ప్రభుత్వంలోకి వచ్చింది. బసవరాజ్​ బొమ్మై సీఎం అయ్యారు.

ఇక 2023 కర్ణాటక ఎన్నికల విషయానికొస్తే.. మే 10న పోలింగ్​ జరుగుతుండగా.. 13న, అంటే శనివారం ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుంది. శనివారం సాయంత్రం నాటికి ఏ అభ్యర్థి పరిస్థితేంటి? ఏ పార్టీ పరిస్థితేంటి? అన్నది తేలిపోతుంది.

IPL_Entry_Point

సంబంధిత కథనం