Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికలు..ఆంధ్రా సరిహద్దుల్లో అలర్ట్-increased vigilance in andhra borders in the wake of karnataka assembly elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Increased Vigilance In Andhra Borders In The Wake Of Karnataka Assembly Elections

Karnataka Elections: కర్ణాటకలో ఎన్నికలు..ఆంధ్రా సరిహద్దుల్లో అలర్ట్

HT Telugu Desk HT Telugu
May 02, 2023 11:56 AM IST

Karnataka Elections: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దుల్లో నిఘాను పటిష్టం చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆంధ్రాతో సరిహద్దులు ఉన్న ప్రదేశాల్లో గస్తీ పెంచాలని సీఈసీ ఆదేశించారు.

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అలర్ట్
కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో ఏపీలో అలర్ట్

Karnataka Elections: మే 10వ తేదీన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో అక్రమ మద్యం, నగదు వంటివి రవాణా చేయకుండా నియంత్రించేందుకు 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిజవహర్ రెడ్డి కేంద్ర ప్రధాన ఎన్నికల కమీషనర్ కు వివరించారు. ఢిల్లీ నుండి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు గోయల్, పాండేలతో కలిసి కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దు కలిగిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణా,మహారాష్ట్ర, గోవా,కేరళ,తమిళనాడు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు, డిజిపిలు, ఎన్నికల సంఘం సిఇఓలు ఇతర సీనియర్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

ట్రెండింగ్ వార్తలు

కర్ణాటక రాష్ట్రంతో సరిహద్దులు కలిగిన జిల్లాల్లో పోలీస్, ఎక్సైజ్, వాణిజ్య పన్నులు,రెవెన్యూ తదితర విభాగాల అధికారులు, సిబ్బందితో కూడిన 45 ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్టులను ఏర్పాటు చేసినట్లు వివరించారు. చెక్ పోస్టుల ద్వారా ఇప్పటి వరకూ 3వేల లీటర్ల అక్రమ ఐఎంఎఫ్ఎల్ లిక్కర్, ఒక్కొక్కటి 90 మిల్లీ లీటర్లు కలిగిన 444 టెట్రా ఫ్యాక్ లు,రెండున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అక్రమ మద్యం,నగదు రవాణా చేయకుండా ఆయా చెక్ పోస్టులలో నిరంతరం నిఘా పెట్టామని డిజిపి కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు తెలిపారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ రానున్న కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడా అక్రమ మద్యం,నగదు రవాణా కాకుండా సరిహద్దు రాష్ట్రాల చెక్ పోస్టులు ద్వారా నిరంతర నిఘాపెట్టి విస్తృతమైన తనిఖీలు చేపట్టాలని ఆయా రాష్ట్రాల సిఎస్,డిజిపిలను ఆదేశించారు.అసాంఘిక శక్తులు ప్రవేశించకుండా చెక్ పోస్టుల్లో కట్టిదిట్టమైన నిఘా పెట్టాలని ఆదేశించారు.మహిళలు,యువత భాగస్వామ్యంతో ఓటింగ్ శాతం పెరిగేలా చూడడంతో పాటు హింసాత్మక సంఘటనలకు ఆస్కారం లేని విధంగా రీపోల్ అవకాశం లేని రీతిలో ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని సిఇసి రాజీవ్ కుమార్ స్పష్టం చేశారు.

 

IPL_Entry_Point