Layoffs 2022 : 'టెక్' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!
03 July 2022, 22:00 IST
- Layoffs 2022 : మాంద్యం భయాల మధ్య అనేకమంది ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. అమెరికాలో ఈ ఏడాది ఇప్పటివరకు 22వేల మంది టెక్ ఉద్యోగులు.. తమ ఉద్యోగాలు కోల్పోయారు! భారత్‌లోనూ పరిస్థితులు ఆందోళనకరంగానే ఉన్నాయి.
'టెక్' ఉద్యోగాలు ఊడిపోతున్నాయి.. 22వేల మంది ఇంటికి!
Layoffs 2022 : రెసెషన్ భయం వేళ ఉద్యోగాల కోత వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. 'కాస్ట్ కట్టింగ్' పేరుతో బడా సంస్థలు ఇప్పటికే ఉద్యోగులను కట్ చేస్తున్నాయి. ఈ ఏడాది.. అమెరికాలో ఇప్పటికే 22వేల మంది టెక్ సంస్థలకు చెందిన వారు ఉద్యోగాలు కోల్పోయినట్టు చర్న్బేస్ నివేదిక పేర్కొంది. ఇండియాలోని అంకుర సంస్థలు ఈ ఏడాది 12వేల మందిని ఉద్యోగం నుంచి తొలగించినట్టు వెల్లడించింది.
నివేదిక ప్రకారం.. కొవిడ్ పరిస్థితులతో లబ్ధి పొందిన సంస్థలు ప్రస్తుతం తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి. వాల్యుయేషన్లు కరెక్ట్ అవుతుండటం ఇందుకు కారణం. ప్రస్తుత పరిస్థితుల్లో పెట్టుబడులు సేకరించడం మరింత కష్టంగా మారిందని స్టార్ట్అప్స్ ఆందోళన చెందుతున్నాయి.
Job cuts 2022 : నెట్‌ఫ్లిక్స్, రాబిన్‌హుడ్ వంటి సంస్థలు.. ఇప్పటికే సిబ్బందిని తగ్గించుకోవడం మొదలుపెట్టాయి. కాయిన్‌బేస్, జెమిని, క్రిప్టో.కామ్, వాల్డ్, బైబిట్, బిట్‌పాండా వంటి క్రిప్టోకు సంబంధించిన సంస్థలు కూడా చేతులెత్తేస్తున్నాయి.
ఈ జాబితాలోకి ఆటో దిగ్గజం టెస్లా కూడా చేరడం గమనార్హం. ఇప్పటికే 10శాతం సిబ్బందిని టెస్లా కట్ చేసేసింది. ఈ దెబ్బకు అమెరికాలోని ఓ కార్యాలయమే మూతపడిపోయింది.
ఇక ఇండియా విషయానికొస్తే.. ఒక్క 2022లోనే అంకుర సంస్థలు.. 60వేలకుపైగా ఉద్యోగులను తొలగించే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.
Job cuts in startups : ఓలా, బ్లింక్ఇట్, బైజూస్, అన్అకాడమీ, వేదాంతు, కార్స్24, లిడో లర్నింగ్‌తో పాట ఇతర సంస్థలు ఇప్పటికే 12వేల మందిని ఇంటికి పంపించేశాయి.
టాపిక్