తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Lalu's Kidney Transplant Surgery: లాలు కిడ్నీ మార్పిడి సర్జరీ సక్సెస్

Lalu's kidney transplant surgery: లాలు కిడ్నీ మార్పిడి సర్జరీ సక్సెస్

HT Telugu Desk HT Telugu

06 December 2022, 19:16 IST

google News
  • Lalu's kidney transplant surgery: ఆర్జేడీ చీఫ్ లాలు ప్రసాద్ యాదవ్ కు సింగపూర్ లో వైద్యులు కిడ్నీ మార్పిడి ఆపరేషన్ ను విజయవంతంగా చేశారు.

సింగపూర్ ఆసుపత్రిలో కూతురు రోహిణి ఆచార్యతో లాలు ప్రసాద్ యాదవ్
సింగపూర్ ఆసుపత్రిలో కూతురు రోహిణి ఆచార్యతో లాలు ప్రసాద్ యాదవ్ (Rohini Acharya Twitter)

సింగపూర్ ఆసుపత్రిలో కూతురు రోహిణి ఆచార్యతో లాలు ప్రసాద్ యాదవ్

Lalu's kidney transplant surgery: లాలు ప్రసాద్ యాదవ్ కు రెండు మూత్ర పిండాలు పాడవడంతో, ఒక కిడ్నీని ఇవ్వడానికి ఆయన కూతురు రోహిణి ఆచార్య ముందుకు వచ్చారు. దాంతో, సింగపూర్ లో సోమవారం ఆయనకు కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్ ఆపరేషన్ జరిగింది. తాను ఆరోగ్యంగా ఉన్నానని మంగళవారం లాలు తెలిపారు.

Lalu's kidney transplant surgery: లాలు ఆరోగ్యంగా ఉన్నారు

సింగపూర్ లో లాలు ఆపరేషన్ సమయంలో ఆయన కుమారుడు, బిహార్ ఉప ముఖ్యమంత్రి లాలు ప్రసాద్ యాదవ్ అక్కడే ఉన్నారు. తన తండ్రి లాలు ప్రసాద్ యాదవ్, కిడ్నీ ఇచ్చిన తన సోదరి రోహిణి ఆచార్య ఆరోగ్యంగా ఉన్నారని తేజస్వీ తెలిపారు. తన తండ్రి, సోదరిల ఆరోగ్యం గురించి ప్రార్థించిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నానన్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లాలు ప్రసాద్ యాదవ్ వీడియోను కూడా తేజస్వి ట్విటర్ లో షేర్ చేసుకున్నారు. దాణా కుంభకోణంలో శిక్ష అనుభవిస్తున్న లాలు ప్రసాద్ యాదవ్ కు అనారోగ్య కారణాలతో బెయిల్ లభించింది.

Lalu's kidney transplant surgery: కూతురిపై ప్రశంసలు

తండ్రికి మూత్రపిండం ఇవ్వడానికి సిద్ధపడిన లాలు ప్రసాద్ యాదవ్ కూతురు రోహిణి ఆచార్యపై పార్టీలకు అతీతంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆమె గొప్ప మనిషి అని తమ్ముడు తేజస్వీ వ్యాఖ్యానించారు. అందరికీ రోహిణి వంటి కూతురు ఉండాలని కేంద్ర మంత్రి, బీజేపీ నేత గిరిరాజ్ సింగ్ కూడా రోహిణిపై ప్రశంసలు కురిపించారు. రోహిణి ఆచార్య సింగపూర్ లో ఉంటారు. లాలు ఆరోగ్యంగా తిరిగిరావాలని కోరుకుంటూ బిహార్ వ్యాప్తంగా గుళ్లు, మసీదులు, చర్చ్ ల్లో అభిమానులు, ఆర్జేడీ కార్యకర్తలు ప్రత్యేక పూజలు, ప్రార్థనలు జరిపారు. కాగా, లాలు ఆరోగ్యం గురించి ప్రధాని మోదీ మంగళవారం ఉదయం తేజస్వీ యాదవ్ కు ఫోన్ చేసి ఆరా తీశారు. లాలు త్వరగా కోరుకోవాలని ఆకాంక్షించారు.

టాపిక్

తదుపరి వ్యాసం