Lalu's daughter to donate kidney: లాలూ ప్రసాద్ యాదవ్‌కు కిడ్నీ ఇవ్వనున్న కూతురు
10 November 2022, 13:11 IST
- Lalu's daughter to donate kidney: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన కూతురు కిడ్నీ ఇవ్వనున్నారు.
కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న లాలూ ప్రసాద్ యాదవ్
న్యూఢిల్లీ: కిడ్నీ సంబంధిత అస్వస్థతతో బాధపడుతున్న రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు ఆయన కుమార్తె కిడ్నీ దానం చేయనున్నట్లు కుటుంబసభ్యులు గురువారం తెలిపారు.
74 ఏళ్ల యాదవ్ తన కిడ్నీ సమస్యల చికిత్స కోసం సింగపూర్ వెళ్లి గత నెలలో తిరిగి వచ్చారు. పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆర్జేడీ అధ్యక్షుడికి కిడ్నీ మార్పిడి చేయాలని వైద్యులు సూచించారు.
సింగపూర్‌లో ఉన్న ఆయన కుమార్తె రోష్నీ ఆచార్య తన తండ్రికి కొత్త జీవితాన్ని ఇచ్చేందుకు ముందుకు వచ్చిందని కుటుంబ సభ్యుడు తెలిపినట్టు పీటీఐ వార్తా సంస్థ నివేదించింది.
ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్ పశుగ్రాసం కేసులో బెయిల్‌పై బయట ఉన్నారు. పశుగ్రాసం కేసుల్లో ప్రమేయంతో జైలుకెళ్లిన ఆయన చికిత్స కోసం ఢిల్లీ, రాంచీల్లో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు.
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స ఎక్కడ, ఎప్పుడు జరుగుతుందనే దానిపై స్పష్టత లేదు.
టాపిక్