తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kvs Recruitment 2022: కేవీల్లో ఉద్యోగాలకు అప్లై చేశారా? ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి

KVS Recruitment 2022: కేవీల్లో ఉద్యోగాలకు అప్లై చేశారా? ఎగ్జామ్ డేట్స్ వచ్చేశాయి

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:33 IST

google News
  • KVS Recruitment 2022: కేంద్రీయ విద్యాలయ సంఘటన్ (Kendriya Vidyalaya Sangathan KVS) లో పలు ఉద్యోగాలకు ఇటీవల నోటిఫికేషన్స్ విడుదల అయిన విషయం తెలిసిందే. వాటికి సంబంధించిన పరీక్ష తేదీలను కేవీఎస్ (KVS) ప్రకటించింది.

KVS Recruitment 2022: ప్రతీకాత్మక చిత్రం
KVS Recruitment 2022: ప్రతీకాత్మక చిత్రం

KVS Recruitment 2022: ప్రతీకాత్మక చిత్రం

KVS Recruitment 2022: దేశవ్యాప్తగా కేంద్రీయ విద్యాలయాల్లో ప్రైమరీ టీచర్లు, ఆఫీసర్స్, ఇతర పోస్టులకు సంబంధించిన పరీక్షల షెడ్యూల్ ను KVS (Kendriya Vidyalaya Sangathan) విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కేవీఎస్ అధికారిక వెబ్ సైట్ kvsangathan.nic.in. లో అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు. అడ్వర్టైజ్ మెంట్ నెంబర్ 15, అడ్వర్టైజ్ మెంట్ నెంబర్ 16 లకు సంబంధించిన డైరెక్ట్ రిక్రూట్ మెంట్ కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు (computer based tests) ఫిబ్రవరి 7 న ప్రారంభమై, మార్చి 6వ తేదీన ముగుస్తాయి.

KVS Recruitment 2022: కేవీఎస్ లో ఏ పోస్ట్ కు ఎప్పుడు ఎగ్జామ్

  • ఫిబ్రవరి 7 - అసిస్టెంట్ కమిషనర్ పోస్ట్ (Assistant Commissioner)
  • ఫిబ్రవరి 8 - ప్రిన్సిపాల్ పోస్ట్ (Principal)
  • ఫిబ్రవరి 9 - వైస్ ప్రిన్సిపాల్ అండ్ పీఆర్ టీ(మ్యూజిక్) (Vice Principal and PRT Music)
  • ఫిబ్రవరి 12 నుంచి ఫిబ్రవరి 14 వరకు - టీజీటీ (TGT)
  • ఫిబ్రవరి 16 నుంచి ఫిబ్రవరి 20 వరకు - పీజీటీ (PGT)
  • ఫిబ్రవరి 20 - ఫైనాన్స్ ఆఫీసర్, ఏఈ సివిల్, హిందీ ట్రాన్స్ లేటర్ పోస్ట్ (Finance Officer, AE (Civil) and Hindi Translator)
  • ఫిబ్రవరి 21 నుంచి ఫిబ్రవరి 28 వరకు - పీఆర్ టీ (PRT)
  • మార్చి నెల 1వ తేదీ నుంచి మార్చి 5 వరకు - జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Jr Secretariat Assistant)
  • మార్చి 5 - గ్రేడ్ 2 స్టెనో గ్రాఫర్ (Stenographer Grade II)
  • మార్చి 6 - లైబ్రేరియన్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (Librarian, Assistant Section Officer and Senior Secretariat Assistant)

KVS Recruitment 2022: అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు?

KVS Recruitment 2022 పరీక్షలకు సంబంధించిన అడ్మిట్ కార్డులను త్వరలో జారీ చేయనున్నారు. మొత్తం 6990 పోస్ట్ లను భర్తీ చేయడానికి ఈ డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ ను చేపట్టారు. ఈ పోస్ట్ లకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జనవరి 2 తో ముగిసింది.

KVS Recruitment 2022: పూర్తి వివరాలకు

- కేవీఎస్ అధికారిక వెబ్ సైట్ ను kvsangathan.nic.in ను అభ్యర్థులు సందర్శించాలి.

  • KVS Direct Recruitment 2022 tentative schedule లింక్ పై క్లిక్ చేయాలి.
  • పరీక్ష తేదీల వివరాలతో కొత్త పేజ్ ఓపెన్ అవుతుంది.
  • మీరు రాసే పరీక్ష తేదీ ఎప్పుడు చెక్ చేసుకుని, సంబంధిత పేజీని డౌన్ లోడ్ చేసుకుని పెట్టుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం ఆ పేజీని ప్రింట్ తీసి భద్రపర్చుకోవడం ఉత్తమం.

టాపిక్

తదుపరి వ్యాసం