తెలుగు న్యూస్  /  National International  /  Kcr's Next Meeting Of Brs At Chandrapur In Maharashtra

Next BRS meeting in Maharashtra: మహారాష్ట్రలో కేసీఆర్ తదుపరి మీటింగ్ చంద్ర పూర్ లో..

HT Telugu Desk HT Telugu

16 May 2023, 16:19 IST

    • Next BRS meeting in Maharashtra: మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు ప్రయత్నాలను ముమ్మరం చేశారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)
తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో) (Stock Photo)

తెలంగాణ సీఎం కేసీఆర్ (ఫైల్ ఫొటో)

Next BRS meeting in Maharashtra: మహారాష్ట్రలో భారత్ రాష్ట్ర సమితి (BRS) ని మరింత బలోపేతం చేసే దిశగా తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు (KCR) ప్రయత్నాలను ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో నిర్వహించిన మూడు బహిరంగ సభలు విజయవంతం కావడంతో, ఈ నెలాఖరులోగా మరో సభను నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. మే 19, మే 20 తేదీల్లో నాందేడ్ లో పార్టీ (BRS) కార్యకర్తల శిక్షణ కార్యక్రమం ఉంటుందని, రాష్ట్రంలోని ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కనీసం ఇద్దరు ప్రతినిధులు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొంటారని బీఆర్ఎస్ (BRS) మహారాష్ట్ర కో ఆర్డినేటర్ ద్యానేశ్ వాకుడ్కర్ వెల్లడించారు.

ట్రెండింగ్ వార్తలు

Parents sue Serum Institute: కోవి షీల్డ్ తో కూతురి మృతి!; సీరమ్ ఇన్స్టిట్యూట్ పై కేసు వేసిన పేరెంట్స్

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Next BRS meeting in Maharashtra: ఈ సారి చంద్రపుర్ లో

ఈ నాలుగో సభను ఈ నెలాఖరున కానీ, జూన్ తొలి వారంలో కానీ మహారాష్ట్రలోని చంద్రపుర్ లో నిర్వహించనున్నట్లు సమాచారం. మహారాష్ట్ర బీఆర్ఎస్ (BRS) నేతలు ఈ సారి షోలాపూర్ లో కానీ, నాగపూర్ లో కానీ కేసీఆర్ సభ పెట్టాలని కోరుకున్నారని, అయితే, ముందుగా చంద్రపుర్ భారీ సభను నిర్వహించాలని పార్టీ నిర్ణయించిందని బీఆర్ఎస్ (BRS) వర్గాలు తెలిపాయి. చంద్రపుర్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఉన్నారు. ఈ సభలో స్థానిక కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన నాయకులు బీఆర్ఎస్ (BRS) లో చేరే అవకాశముందని పార్టీ వర్గాలు తెలిపాయి .

Next BRS meeting in Maharashtra: సంక్షేమ పథకాలు

ఇప్పటివరకు మహారాష్ట్రలో కేసీఆర్ (KCR) పాల్గొన్న మూడు సభలు విజయవంతమయ్యాయి. ఫిబ్రవరి 5న నాందేడ్ లో, మార్చి 26న నాందేడ్ జిల్లాలోని కాంధర్ లోహా లో, ఏప్రిల్ 24న ఛత్రపతి శంభాజీ నగర్ లో కేసీఆర్ భారీ బహిరంగ సభలు నిర్వహించారు. మహారాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మహారాష్ట్ర రైతులు ఎదుర్కొంటున్న రైతుల ఆత్మహత్యలు, దళితులపై దాడులు, అత్యాచారాలు వంటి సమస్యలపై కేసీఆర్ (KCR) ప్రధానంగా దృష్టి పెడుతున్నారు. అధికారంలోకి వస్తే తెలంగాణలో అమలు చేసిన రైతు బంధు, దళిత బంధు తదితర సంక్షేమ పథకాలను మహారాష్ట్రలో కూడా అమలు చేస్తామని హామీ ఇస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ (BRS) ఒంటరిగానే పోటీ చేస్తుందని కేసీఆర్ (KCR) ఇప్పటికే ప్రకటించారు. అబ్ కీ బార్.. కిసాన్ సర్కార్ (Ab ki Baar Kisan Sarkar)’ నినాదంతో రాష్ట్రంలోని మొత్తం 288 నియోజకవర్గాల్లో బరిలో దిగుతామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర మీడియాకు తెలంగాణ ప్రభుత్వం భారీగా ప్రకటనలు ఇస్తోంది. తెలంగాణ ప్రభుత్వ విజయాలను ఆ ప్రకటనల్లో వివరిస్తోంది.

టాపిక్