తెలుగు న్యూస్  /  National International  /  Karnataka: Man Booked For Harassing Minor Girl For Marriage

Man booked under anti conversion law:బాలికపై అత్యాచారం. ఆ పై మతం మారాలని ఒత్తిడి

HT Telugu Desk HT Telugu

23 November 2022, 20:20 IST

  • Man booked under anti conversion law: 13 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆ పై వివాహం చేసుకోవాలంటే మతం మారాలని ఒత్తిడి చేసిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మాయ మాటలతో మభ్య పెట్టి, ఆమె అర్థనగ్న ఫొటోలను తీసి, ఆ పై ఆ బాలికను బెదిరించాడని పోలీసులు తెలిపారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Man booked for harassing minor girl: ఈ దారుణం కర్నాటకలో ఉన్న మాండ్య జిల్లాలోని నాగమంగల పట్టణంలో జరిగింది. ఆ బాలిక ఇంటి ఎదురింట్లో ఉండే యూనస్ పాషా అలియాస్ ఫయాజ్ మొహమ్మద్ ఈ నేరానికి పాల్పడ్డాడని పోలీసులకు ఫిర్యాదు రావడంతో, ఆ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

IMD predictions: మే 4 నుంచి తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు: ఐఎండీ హెచ్చరిక

Salman Khan: సల్మాన్ ఖాన్ ఇంట్లో కాల్పుల ఘటనలో నిందితుడు అనూజ్ థాపన్ అనుమానాస్పద మృతి

Crime news: బ్లాక్ మెయిల్ చేసి క్లాస్ మేట్ నుంచి రూ.35 లక్షలు లాక్కున్న టెంత్ క్లాస్ విద్యార్థులు

Bengaluru news: ‘‘1983 తర్వాత బెంగళూరుకు ఈ దుస్థితి రావడం ఈ సంవత్సరమే..’’; ఐఎండీ శాస్త్రవేత్త వెల్లడి

Man booked for harassing minor girl: నిద్ర మాత్రలు కలిపి..

బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. మొదట యూనస్ పాషా ఆ బాలికకు ఒక స్మార్ట్ ఫోన్ గిఫ్ట్ గా ఇచ్చాడు. ఆ తరువాత క్రమంగా ఆ బాలికతో వీడియో కాల్స్ మాట్లాడడం ప్రారంభించాడు. ఆమె అర్థనగ్న ఫొటోలను తీసి, ఆమెను బెదిరించడం ప్రారంభించాడు. బాలిక తల్లిదండ్రులు వేరే ఊరికి వెళ్లడం గమనించి, బాలికతో పాటు ఉన్న ఆమె నానమ్మకు సాంబారులో నిద్రమాత్రలు కలిపి, స్పృహ కోల్పోయేలా చేశాడు. అనంతరం, ఆ బాలికను బెదిరించి, అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని కోరిన ఆ బాలికను మతం మారితే పెళ్లి చేసుకుంటానని షరతు పెట్టాడు. ఊరి నుంచి వచ్చిన తరువాత ఆ బాలిక ప్రవర్తనలో మార్పును తల్లిదండ్రులు గమనించారు. ఆ బాలికను ప్రశ్నించగా, జరిగిన విషయాన్ని ఆ బాలిక తన తల్లిదండ్రులకు వివరించింది. దాంతో, వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Man booked under anti conversion law: పోలీసు కేసు

నిందితుడైన యూనస్ పాషాపై, ఇటీవల అమల్లోకి వచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టం( anti-conversion Act), పొక్సొ(POCSO)తో పాటు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

టాపిక్