తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Karnataka Election Results : స్పష్టంగా కాంగ్రెస్​ హవా.. బీజేపీకి ఓటమి ఖాయం!

Karnataka election results : స్పష్టంగా కాంగ్రెస్​ హవా.. బీజేపీకి ఓటమి ఖాయం!

Sharath Chitturi HT Telugu

13 May 2023, 12:04 IST

    • Karnataka election results : కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్​ ఆధిక్యంలో దూసుకెళుతోంది. బీజేపీ వెనకపడింది. మరి ఇప్పుడు బీజేపీ అధికారాన్ని కోల్పోనుందా?
ఓ ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు..
ఓ ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు.. (PTI)

ఓ ఓట్ల లెక్కింపు కేంద్రంలో అధికారులు..

Karnataka election results : కర్ణాటక ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్​ హవా కొనసాగుతోంది! శనివారం ఉదయం ప్రారంభమైన ఓట్ల లెక్కింపు ప్రక్రియలో అధికార బీజేపీ కన్నా అత్యధిక సీట్లల్లో కాంగ్రెస్​ ముందంజలో ఉంది. బీజేపీ, జేడీఎస్​లు తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్​ శిబిరంలో సందడి వాతావరణం నెలకొంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

బీజేపీకి ఓటమి తప్పదా..?

కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లున్నాయి. 2,615 మంది ఎన్నికల్లో పోటీ పడ్డారు. కాగా.. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. కాంగ్రెస్​ 120 సీట్లల్లో లీడ్​లో ఉంది. బీజేపీ 70 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. జేడీఎస్​ కేవలం 27 సీట్లలో ముందజంలో ఉంది. స్వతంత్రులు 7 సీట్లలో లీడ్​ను కొనసాగుతున్నారు.

ఎలక్షన్ కమిషన్ గణాంకాల ప్రకారం ఉదయం 11:30 గంటల వరకు కాంగ్రెస్‌కు 42.93 శాతం ఓట్లు లభించాయి. బీజేపీకి 36.17 శాతం ఓట్లు లభించాయి. జేడీఎస్‌కు 12.97 శాతం ఓట్లు లభించాయి.

Karnataka election results 2023 : కర్ణాటకలో మేజిక్​ ఫిగర్​ 113 అన్న విషయం తెలిసిందే. ఈ నెంబర్​ దాటిన పార్టీ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయవచ్చు. మేజిక్​ ఫిగర్​కు దగ్గర్లో ఉన్న పార్టీలు.. ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకునే పనిలో పడొచ్చు!

కాంగ్రెస్​లో సంబరాలు..

తాజా పరిస్థితుల నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్​ బృందంలో వేడుకలు మొదలయ్యాయి! పార్టీ సొంతంగా అధికారంలోకి వస్తుందని సభ్యులు సంతోషపడుతున్నారు. పార్టీ అధిష్ఠానంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యాలయం వద్ద కార్యకర్త సందడి నానాటికి పెరుగుతోంది. ఆనందంతో వారందరు డ్యాన్స్​లు చేస్తున్నారు. బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకుంటున్నారు.

కర్ణాటక ఎన్నికల ఫలితాల లైవ్​ అప్డేట్స్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Karnataka election results live updates : కర్ణాటక ఎన్నికల ఫలితాల పరిణామాలతో దిల్లీలోని కాంగ్రెస్​ ప్రధాన కార్యాలయంలోనూ సందడి వాతావరణం నెలకొంది. కార్యకర్తలు, నేతలు వేడుకలు చేసుకుంటున్నారు.

ఎన్నికల ఫలితాల నేపథ్యంలో నేతలు ఆలయాల చుట్టూ తిరుగుతున్నారు. హుబ్బళ్లీలోని హనుమాన్​ గుడిలో శనివారం ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రస్తుత సీఎం బసవరాజ్​ బొమ్మై.

గత ఎన్నికల్లో..

Karnataka congress latest news : 2018 ఎన్నికల్లో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. కానీ ప్రభుత్వాన్ని నిలబెట్టుకోలేకపోయింది. అనేక నాటకీయ పరిణామాల మధ్య.. కాంగ్రెస్​- జేడీఎస్​లు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎమ్మెల్యేల తిరుగుబాటుతో కొంతకాలం తర్వాత ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది. చివరికి మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చింది.

తదుపరి వ్యాసం