JEE mains admit card: జేఈఈ మెయిన్స్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోండి
21 July 2022, 21:17 IST
- JEE mains admit card 2022 session 2: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 పరీక్ష జూలై 25 నుంచి ప్రారంభం కానుంది. హాల్‌టికెట్లు డౌన్ లోడ్ చేసుకునేందుకు ఈ కింది లింక్ క్లిక్ చేయండి
JEE mains admit card 2022 session 2 అడ్మిట్ కార్డు జూలై 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
jee mains nta nic admit card: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2ను జూలై 25 నుంచి దేశవ్యాప్తంగా 500 నగరాల్లోని వివిధ పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మొత్తం 6,29,778 మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరుకున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) త్వరలో జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డులను జూలై 21న విడుదల చేయనుంది. జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డులను అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచనున్నారు.
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 పరీక్ష జూలై 25 నుంచి జరుగుతుంది. అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు ఈ క్రింది స్టెప్స్ అనుసరించవచ్చు.
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2: అడ్మిట్ కార్డులను డౌన్లోడ్ చేసుకోవడం ఎలా?
స్టెప్ 1: అధికారిక సైట్ ని సందర్శించండి. సైట్ డైరెక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
స్టెప్ 2: జేఈఈ మెయిన్ సెషన్ 2 అడ్మిట్ కార్డ్ 2022 లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ లాగిన్ వివరాలను నమోదు చేయండి. తరువాత సబ్మిట్ చేయండి
స్టెప్ 4: మీ జేఈఈ మెయిన్ 2022 సెషన్ 2 అడ్మిట్ కార్డులు మీ కంప్యూటర్ స్క్రీన్లపై కనిపిస్తాయి.
స్టెప్ 5: దానిని డౌన్ లోడ్ చేసుకోండి. దానిని ప్రింట్ కూడా తీసుకుని పెట్టుకోండి.
అడ్మిట్ కార్డు డౌన్‌లోడ్ చేయడంలో ఇబ్బంది ఉంటే 011-40759000 నెంబరులో సంప్రదించవచ్చు.
జేఈఈ మెయిన్ 2022 వివరాలు ఇవే..
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 ఫలితాలను జూలై 11న ప్రకటించారు. జేఈఈ మెయిన్ పరీక్షను 407 నగరాల్లోని 588 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించారు. విదేశాలలో కూడా జరిగిన ఈ పరీక్షకు 558 మంది పరిశీలకులు, 424 మంది నగర సమన్వయకర్తలు, 18 మంది ప్రాంతీయ కోఆర్డినేటర్లు, 369 మంది డిప్యూటీ, స్వతంత్ర పరిశీలకులు, ఇద్దరు జాతీయ కోఆర్డినేటర్లను నియమించారు.
జేఈఈ మెయిన్ 2022ను ఇంగ్లిష్, హిందీ, అస్సామీస్, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహిస్తారు.
జేఈఈ మెయిన్ 2022లో రెండు పేపర్లు ఉంటాయి. ఎన్ఐటీలు, ఐఐఐటీలు, ఇతర కేంద్రీయ నిధులతో నడిచే సాంకేతిక సంస్థలు(సీఎఫ్టీఐలు), రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో కూడిన, గుర్తింపు పొందిన ఇన్స్టిట్యూషన్లు, యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రామ్స్ (బీఈ/బీటెక్)లో ప్రవేశానికి పేపర్-1 నిర్వహిస్తారు. బి.ఆర్క్, బి.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశానికి పేపర్-2 నిర్వహిస్తారు. ఐఐటీల్లో ప్రవేశానికి జేఈఈ (అడ్వాన్స్డ్) అర్హత పరీక్ష నిర్వహిస్తారు.