తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023 Session 1: జేఈఈ మెయిన్ పరీక్ష ఎలా ఉంది? డిఫికల్టీ లెవెల్ ఎంత?

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ పరీక్ష ఎలా ఉంది? డిఫికల్టీ లెవెల్ ఎంత?

HT Telugu Desk HT Telugu

24 January 2023, 21:43 IST

    • జనవరి 24 నుంచి జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main 2023 Session 1) పరీక్షలు ప్రారంభమయ్యాయి. జనవరి 24, మంగళవారం జరిగిన పరీక్ష వివరాలు, ప్రశ్నాపత్రం కఠినత్వం తదితరాల విశ్లేషణ (JEE Main 2023 Session 1 analysis) ఇది..
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023 Session 1 analysis: B.E./B.Tech లలో అడ్మిషన్ల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్ 1, 2023 (JEE Main Paper-1) ఆఫ్టర్ నూన్ సెషన్ పరీక్ష జనవరి 24న జరిగింది. ఈ పరీక్షకు విద్యార్థుల రిపోర్టింగ్ టైమ్ మధ్యాహ్నం 1.30 గంటలు. పరీక్ష సరిగ్గా మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైంది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

JEE Main 2023 Session 1: అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు

ఈ JEE Main Paper-1 పరీక్షలో మొత్తం కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమెటిక్స్ అనే మూడు పార్ట్ లుగా 90 ప్రశ్నలున్నాయి. మొత్తం మార్కులు 300. కెమిస్ట్రీ, ఫిజిక్స్, మేథమెటిక్స్ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలుంటాయి. ప్రతీ సబ్జెక్టులో న్యుమరికల్ బేస్డ్ సెక్షన్ లోని 10 ప్రశ్నల్లో 5 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలివ్వాలి. మూడు సబ్జెక్టుల్లో సీబీఎస్సీ (CBSE ) క్లాస్ 11, క్లాస్ 12 లలోని అన్ని చాప్టర్లను కవర్ చేస్తూ ప్రశ్నలను ఇచ్చారు. విద్యార్థులను పరీక్ష కేంద్రంలోకి ఒక ట్రాన్స్ పరెంట్ బాల్ పాయింట్ పెన్, అడ్మిట్ కార్డు, ఆధార్ కార్డులను మాత్రమే తీసుకువెళ్లేందుకు అనుమతించారు.

JEE Main 2023 Session 1: ప్రశ్నా పత్రం విశ్లేషణ

  • JEE Main 2023 Session 1 పార్ట్ 1 ఫిజిక్స్ లో 30 ప్రశ్నలున్నాయి. ఇందులో సెక్షన్ 1 లో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలున్నాయి. వీటికి నెగటివ్ మార్కులుంటాయి. ప్రతీ సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు పోతుంది. సెక్షన్ 2 లో 10 న్యుమరికల్ బేస్డ్ ప్రశ్నలున్నాయి. వీటిలో 5 ప్రశ్నలకు మత్రమే సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఇందులో కూడా నెగటివ్ మార్కింగ్ సెక్షన్ 1 లో మాదిరిగానే ఉంటుంది. ఈ పార్ట్ లో మొత్తం మార్కులు 100.
  • JEE Main 2023 Session 1 పార్ట్ 2 లో కెమిస్ట్రీ లో 30 ప్రశ్నలుంటాయి. ఇందులో కూడా సెక్షన్ 1 లో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలున్నాయి. వీటికి నెగటివ్ మార్కులుంటాయి. ప్రతీ సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు పోతుంది. సెక్షన్ 2 లో 10 న్యుమరికల్ బేస్డ్ ప్రశ్నలున్నాయి. వీటిలో 5 ప్రశ్నలకు మత్రమే సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఇందులో కూడా నెగటివ్ మార్కింగ్ సెక్షన్ 1 లో మాదిరిగానే ఉంటుంది. ఈ పార్ట్ లో మొత్తం మార్కులు 100.
  • JEE Main 2023 Session 1 పార్ట్ 3 మేథమెటిక్స్. ఇందులో కూడా సెక్షన్ 1 లో 20 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలున్నాయి. వీటికి నెగటివ్ మార్కులుంటాయి. ప్రతీ సరైన సమాధానానికి 4 మార్కులు వస్తాయి. ప్రతీ తప్పు సమాధానానికి ఒక మార్కు పోతుంది. సెక్షన్ 2 లో 10 న్యుమరికల్ బేస్డ్ ప్రశ్నలున్నాయి. ఇందులో కూడా నెగటివ్ మార్కింగ్ సెక్షన్ 1 లో మాదిరిగానే ఉంటుంది. వీటిలో 5 ప్రశ్నలకు మత్రమే సమాధానాలివ్వాల్సి ఉంటుంది. ఈ పార్ట్ లో మొత్తం మార్కులు 100.

JEE Main 2023 Session 1: డిఫికల్టీ లెవెల్ ఎంత?

ఈ పరీక్ష రాసిన విద్యార్థుల నుంచి తీసుకున్న సమాచారం ప్రకారం.. మేథమెటిక్స్ క్వశ్చన్ పేపర్ డిఫికల్టీ లెవెల్ ను మధ్య తరహా (Moderate)గా ఉంది. ఆల్ జీబ్రాకు ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు. న్యుమరికల్ బేస్డ్ ప్రశ్నలకు ఎక్కువ కాలిక్యులేషన్ అవసరమైంది. ఫిజిక్స్ పార్ట్ ఈజీగా ఉంది. అన్ని చాప్టర్ల నుంచి ప్రశ్నలు అడిగారు. కెమిస్ట్రీ పార్ట్ ప్రశ్న పత్రం ఈజీ కి, మధ్య తరహా (Moderate) కి మధ్యన ఉంది. ఇనార్గానిక్ కెమిస్ట్రీ కన్నా, ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారు.

టాపిక్

తదుపరి వ్యాసం