JEE Main 2023 Session 1 exam : నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష-jee main 2023 session 1 exam starts from today read full instructions here ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jee Main 2023 Session 1 Exam : నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష

JEE Main 2023 Session 1 exam : నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష

Chitturi Eswara Karthikeya Sharath HT Telugu
Jan 24, 2023 07:08 AM IST

JEE Main 2023 Session 1 exam today : జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్ష నేడు ప్రారంభంకానుంది. అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన పలు విషయాలు ఇక్కడ తెలుసుకోండి.

నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్షలు
నేటి నుంచి జేఈఈ మెయిన్​ సెషన్​ 1 పరీక్షలు

JEE Main 2023 : దేశంలో నేడు 'పరీక్షల సీజన్​' అధికారికంగా ప్రారంభంకానుంది. జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 1 పరీక్ష నేటి నుంచి జరగనుంది. ఇందుకు సంబంధించిన జేఈఈ మెయిన్​ అడ్మిట్​ కార్డులను ఎన్​టీఏ (నేషనల్​ టెస్టింగ్​ ఏజెన్సీ) ఇప్పటికే విడుదల చేసింది. అభ్యర్థులు.. తమ అడ్మిట్​ కార్డులను jeemain.nta.nic.in లో నుంచి డౌన్​లోడ్​ చేసుకోవచ్చు.

ఈ జేఈఈ మెయిన్​ అడ్మిట్​ కార్డులో పరీక్ష తేదీ, టైమ్​, ఎగ్జామ్​ సెంటర్​, రోల్​ నెంబర్​ వంటి వివరాలు ఉంటాయి. అభ్యర్థులు అడ్మిట్​ కార్డులో ఇచ్చిన మార్గదర్శకాలను చదివిన తర్వాత పరీక్షకు హాజరుకావడం మంచిది.

జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 1 గైడ్​లైన్స్​..

  • JEE Main 2023 Guidelines : పరీక్షకు హాజరవుతున్న అభ్యర్థులు చెప్పులు మాత్రమే వేసుకోవాలి. హై హీల్స్​ ధరించకూడదు. షూలను వేసుకోకూడదు.
  • లాంగ్​ స్లీవ్స్​తో కూడిన దుస్తులు వెసుకోకూడదు. మతపరమైన దుస్తులకు అనుమతి ఉంది. కానీ చెకింగ్​ కోసం ఎగ్జామ్​ హాల్​కు ఎంత వీలైతే అంత తొందరగా వెళ్లడం బెటర్​.
  • JEE Main admit card 2023 : జేయియి మెయిన్​ సెషన్​ 1 పరీక్షకు వెళ్లే ముందు అడ్మిట్​ కార్డు, ఫొటో ఐడీ, ఫొటో వంటివి ప్రింటౌట్​ తీసుకోవాల్సి ఉంటుంది. ఎగ్జామ్​ సెంటర్​లో వీటిని చెక్​ చేస్తారు.
  • ఎగ్జామ్​ సెంటర్​ లోపలికి.. హ్యాండ్​ బ్యాంగ్​, ఎలక్ట్రానిక్​ గ్యాడ్జెట్స్​ వంటి వస్తువలకు అనుమతి లేదు.
  • క్యాప్స్​, దుపట్ట, సన్​గ్లాసెస్​ వంటి వస్తువులను తీసుకెళ్లకూడదు. ఎగ్జామ్​ కన్స్​లో టైమ్​ ఉంటుంది. అందువల్ల అభ్యర్థులకు వాచ్​లు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు.
  • JEE Main session 1 admit card : అడ్మిట్​ కార్డుకు సంబంధించిన ఫిజికల్​ కాపీని తీసుకెళ్లకపోతే.. ఎగ్జామ్​ హాల్​ లోపలికి అనుమతి ఉండదన్న విషయం అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాలి.

జేఈఈ మెయిన్​.. రెండు సెషన్స్​లో..

ప్రతియేటా జేఈఈ మెయిన్​ పరీక్ష.. రెండు సెషన్స్​లో జరుగుతుంది. జేఈఈ మెయిన్​ 2023 సెషన్​ 1 ఇంజినీరింగ్​ ఎగ్జామ్​ (పేపర్​ 1, బీఈ/ బీటెక్​) జనవరి 24, 25, 29, 30, 31తో పాటు ఫిబ్రవరిలో జరగనుంది. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్ట్​లలో పరీక్షను నిర్వహిస్తారు. ఇక పేపర్​ 2, ఆర్కిటెక్చర్​ అండ్​ ప్లానింగ్​ పేపర్​ను జనవరి 28న ఒక షిఫ్ట్​లో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.

JEE Main exam schedule :జేఈఈ మెయిన్​ 2023 సెకెండ్​ సెషన్​ ఏప్రిల్​లో జరుగుతుంది. మొత్తం మీద ఈ పరీక్షను.. ఇంగ్లీష్​, హిందీ, అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబ్​, తమిళ్​, తెలుగు, ఉర్దూ వంటి 13 భాషల్లో నిర్వహిస్తారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం