JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..-jee main 2023 session 1 exam city intimation slip out at jeemainntanicin ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  National International  /  Jee Main 2023 Session 1 Exam City Intimation Slip Out At Jeemain.nta.nic.in

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డు డౌన్ లోడ్ చేసుకోండిలా..

HT Telugu Desk HT Telugu
Jan 18, 2023 07:10 PM IST

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ (JEE Main 2023) సెషన్ 1 పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు, సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency NTA) విడుదల చేసింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

JEE Main 2023 Session 1: జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main Session 1) ఈ సంవత్సరం జనవరి 24, 25, 27, 28, 29, 30, 31 తేదీల్లో జరగనుంది. ఆన్ లైన్ లో జరిగే ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డు, సిటి ఇంటిమేషన్ స్లిప్ లను అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ సెషన్ 1 (JEE Main Session 1) పరీక్షకు సంబంధించిన ఎగ్జామ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ లను డౌన్ లోడ్ చేసుకోవడానికి అభ్యర్థి అధికారిక వెబ్ సైట్ లోని సంబంధిత లింక్ ను క్లిక్ చేసి, అప్లికేషన్ నెంబర్ (application number), పుట్టిన తేదీ (date of birth) లను ఎంటర్ చేయాల్సి ఉంటుంది.

ట్రెండింగ్ వార్తలు

JEE Main 2023 Session 1: ఇలా డౌన్ లోడ్ చేసుకోండి

  • అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in. ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో ఉన్న JEE(Main) 2023 Session 1 Advance City Intimation లింక్ పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ లను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
  • అడ్మిట్ కార్డ్ ను డౌన్ లోడ్ చేసుకుని, భద్రపర్చుకోవాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అడ్మిట్ కార్డును ప్రింట్ తీసి పెట్టుకోవాలి.
  • Here's the direct link to download the JEE Main 2023 session 1 advanced city intimation 

IPL_Entry_Point