తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jaishankar Recalls 'Snake' Story: పాక్ జర్నలిస్ట్ కు పాము స్టోరీ చెప్పిన జైశంకర్

Jaishankar recalls 'snake' story: పాక్ జర్నలిస్ట్ కు పాము స్టోరీ చెప్పిన జైశంకర్

HT Telugu Desk HT Telugu

08 January 2024, 21:54 IST

google News
  • Jaishankar recalls 'snake' story: ఉగ్రవాదానికి సంబంధించి భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాక్ జర్నలిస్ట్ కు భారత విదేశాంగ మంత్రి జై శంకర్ బుద్ధి వచ్చేలా సమాధానమిచ్చారు.

భారత విదేశాంగ మంత్రి జై శంకర్
భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (ANI)

భారత విదేశాంగ మంత్రి జై శంకర్

Jaishankar recalls 'snake' story: ఐక్యరాజ్య సమితి భద్రత మండలి సమావేశాల సందర్భంగా న్యూయార్క్ లో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పాక్ జర్నలిస్ట్ కు పాము కథను వివరించారు. అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ (Hillary Clinton) సుమారు పదేళ్ల క్రితం పాకిస్తాన్(pakistan) మంత్రికి చెప్పిన ఈ పాము కథను జైశంకర్ మరో సారి గుర్తు చేశారు.

Jaishankar recalls 'snake' story: పాము స్టోరీతో హిల్లరీ క్లింటన్ హితబోధ

ఉగ్రవాదం విషయంలో భారత్ కు సంబంధించిన కొన్ని పత్రాల విషయాన్ని పాక్(pakistan) మంత్రి హినా రబ్బాని లేవనెత్తారు. ఈ విషయంపై మీడియా సమావేశంలో పాకిస్తాన్ కు చెందిన ఒక జర్నలిస్ట్ భారత విదేశాంగ మంత్రి జై శంకర్(Jaishankar) ను ప్రశ్నించారు. దానిపై జై శంకర్ స్పందిస్తూ ఆ జర్నలిస్ట్ కు పాము కథ చెప్పారు. ‘‘2011లో అనుకుంటా నాటి యూఎస్ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్(Hillary Clinton) పాకిస్తాన్ లో పర్యటించారు. అప్పుడు ఈ హినా రబ్బానీ కూడా అప్పటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంగా ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెబుతూ హిల్లరీ(Hillary Clinton) పాము కథ చెప్పారు. ‘‘మీరు మీ ఇంటి వెనుక పాములను పెంచుకుని, ఆ పాములు మీ పక్కింటివారిని మాత్రమే కాటేస్తాయని అనుకుంటే అది మీ భ్రమ. ఆ పాములు మిమ్మల్ని కూడా కాటేస్తాయి అని అప్పుడు హిల్లరీ(Hillary Clinton) పాక్ పాలకులకు హితబోధ చేశారు. పాక్ లో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది’’ అని జైశంకర్(Jaishankar) సమాధానమిచ్చారు.

Jaishankar recalls 'snake' story: ఉగ్రవాదానికి కేంద్రంగా పాక్

ప్రపంచానికి పెను సవాలుగా మారిన ఉగ్రవాదానికి ప్రధాన కేంద్రంగా పాకిస్తాన్ ఉందన్న విషయాన్ని ప్రపంచమంతా విశ్వసిస్తోందని జై శంకర్(Jaishankar) వ్యాఖ్యానించారు. ‘కోవిడ్ కారణంగా చాలా విషయాలు మర్చిపోయాం కానీ, ఉగ్రవాదం ఎక్కడ పుట్టిందో, ఎక్కడ పెరుగుతోందో ప్రపంచం ఇంకా మర్చిపోలేదు’ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న చాలా ఉగ్రవాద ఘటనలకు మూలాలు పాకిస్తాన్లోనే(pakistan) ఉన్నాయన్నారు. వేరే వారి ముందు బురద జల్లేముందు ఈ విషయాన్ని తెలుసుకోవాలని Jaishankar చురకలంటించారు.

Pakistan Terrorism: ఉగ్రవాదం మూలాలెక్కడ?

భారత్, పాక్, అఫ్గాన్ ల నుంచి ఉగ్రవాదాన్ని తరిమికొట్టడానికి ఇంకా ఎంత కాలం పడుతుందన్న పాక్(pakistan) జర్నలిస్ట్ ప్రశ్నకు జై శంకర్(Jaishankar) సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని పొరపాటు వేదికపై ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నను మీరు మీ(పాక్) మంత్రిని ప్రశ్నించాలి’ అని జైశంకర్(Jaishankar) సమాధానమిచ్చారు. ‘ఎంతకాలం ఉగ్రవాదానికి ఊతమిస్తారు? అని మీరు మీ మంత్రిని ప్రశ్నించాలి’ అన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించడాన్ని వదిలి, మిగతా దేశాల మాదిరిగా అభివృద్ధి, పురోగతిలపై దృష్టి పెట్టమని మీ పాలకులకు చెప్పండి’ అని Jaishankar సలహా ఇచ్చారు.

తదుపరి వ్యాసం