తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Isro Recruitment 2023: ఇస్రోలో సైంటిస్ట్ జాబ్స్; అప్లై చేసుకోండి ఇలా..

ISRO Recruitment 2023: ఇస్రోలో సైంటిస్ట్ జాబ్స్; అప్లై చేసుకోండి ఇలా..

HT Telugu Desk HT Telugu

14 July 2023, 21:47 IST

google News
  • ఇస్రో (ISRO) లో విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (VSSC) లో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.vssc.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇస్రో (ISRO) లో విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (VSSC) లో సైంటిస్ట్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో www.vssc.gov.in. వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

మొత్తం 61 పోస్ట్ లు..

విక్రమ్ సారాబాయి స్పేస్ సెంటర్ (VSSC) లో సైంటిస్ట్ / ఇంజనీర్ -ఎస్డీ (Scientist / Engineer-SD), సైంటిస్ట్ / ఇంజనీర్ - ఎస్సీ (Scientist / Engineer-SC) పోస్ట్ ల భర్తీకి ఇస్రో (ISRO) ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి ఆఖరు తేదీ జులై 21. మొత్తం 61 పోస్ట్ లను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఈ పోస్ట్ లకు అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు రూ. 750. అభ్యర్థులందరూ ఈ ఫీజు చెల్లించాలి. ఆ తరువాత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మెన్, దివ్యాంగ కేటగిరీల అభ్యర్థులకు, వారు రాత పరీక్షకు హాజరైతే, వారి ఫీజు రీఫండ్ చేస్తారు. పరీక్షకు హాజరుకాని అభ్యర్థులకు రీఫండ్ ఉండదు.

how to apply: అప్లై చేయడం ఎలా?

ఈ పోస్ట్ లకు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవాలి. అందుకు..

  • ముందుగా అధికారిక వెబ్ సైట్ www.vssc.gov.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీపై career ట్యాబ్ పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై కనిపించే “VSSC Recruitment Advertisement No: RMT327” పై క్లిక్ చేయాలి.
  • స్క్రీన్ పై మరో పేజీ ఓపెన్ అవుతుంది. ఆ పేజీలో ఉన్న అప్లికేషన్ ఫామ్ ను ఫిల్ చేయాలి.
  • అవసరమైన డాక్యుమెంట్లను అప్ లోడ్ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజును చెల్లించాలి.
  • అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింటౌట్ తీసుకుని సాఫ్ట్ కాపీ, హార్డ్ కాపీలను భద్రపర్చుకోవాలి.

తదుపరి వ్యాసం