Marathon in saree: శారీతో మారథాన్ లో పాల్గొన్న మహిళ.. వైరల్ అవుతున్న వీడియో
08 January 2024, 18:55 IST
Marathon in saree: యూకేలో ఒక మహిళ చీర కట్టుకుని సుదీర్ఘ పరుగుపందెంలో పాల్గొన్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
చీర కట్టుకుని మాంచెస్టర్ మారథాన్ లో పాల్గొన్న మధుస్మిత
Marathon in saree: భారత్ లోని ఒడిశాకు చెందిన మధుస్మిత జెనా దాస్ (Madhusmita Jena-Das) అనే 41 ఏళ్ల మహిళ బ్రిటన్ లో స్థిరపడ్డారు. ఇటీవల ఆమె ఫేమస్ మాంచెస్టర్ మారథాన్ (Manchester Marathon) లో పాల్గొన్నారు. దాదాపు 42.5 కిలోమీటర్ల దూరాన్ని 4 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేశారు. అయితే, ఇది సాధారణ విషయమే. మాంచెస్టర్ మారథాన్ లో చాలా మంది భారతీయులు పాల్గొంటారు. విజయవంతంగా ఆ మారథాన్ ను పూర్తి చేస్తారు. కానీ, మధుస్మిత జెనా దాస్ (Madhusmita Jena-Das) ఆ మారథాన్ ను అందమైన చీరకట్టుతో పూర్తి చేయడంతో, ఆ వీడియో వైరల్ గా మారింది.
Marathon in saree: సంభల్ పురి శారీ..
భారత్ లో పాపులర్ అయిన సంభల్ పురి శారీ కట్టుకుని ఈ మారథాన్ (Marathon) లో మధుస్మిత జెనా దాస్ పాల్గొన్నారు. ఆ చీర కట్టుకుని, మ్యాచింగ్ రన్నింగ్ షూస్ ధరించి ఆమె 42.5 కిలోమీటర్ల మారథాన్ ను 4 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేశారు. భారతీయ సంస్కృతిని, సంప్రదాయాలను ప్రచారం చేసే ఉద్దేశంతో ఈ మారథాన్ (Marathon) లో చీర కట్టుకుని పాల్గొనాలని నిర్ణయించుకున్నానని మధు స్మిత జెనా దాస్ (Madhusmita Jena-Das) వెల్లడించారు. సంభల్ పుర్ శారీలో మధుస్మిత జెనా దాస్ (Madhusmita Jena-Das) పరుగెడుతున్న వీడియోను మొదట ట్విటర్ లో పోస్ట్ చేశారు. తరువాత, ఆ వీడియో అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వైరల్ గా మారింది. చీర లో పరుగెడుతున్న మధుస్మితను ఇతర అథ్లెట్లు చప్పట్లతో, హైఫైవ్ (high-five) లతో, హర్షధ్వానాలతో ప్రోత్సహిస్తున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. ఇప్పటివరకు ఆ వీడియో ట్విటర్ (twitter) లో 45700 వ్యూస్ ను, వెయ్యికి పైగా లైక్స్ ను సాధించింది. నెటిజన్లు పెద్ద సంఖ్యలో ఆమెను ప్రశంసిస్తూ కామెంట్స్ కూడా పెట్టారు.