తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Indian Railways Announces Special Trains : పండుగ సీజన్​ కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు!

Indian Railways announces special trains : పండుగ సీజన్​ కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు!

Sharath Chitturi HT Telugu

07 October 2022, 8:07 IST

    • Indian Railways announces special trains : పండుగ సీజన్​ని దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. ఆ వివరాలు..
పండుగ సీజన్​ కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు!
పండుగ సీజన్​ కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు!

పండుగ సీజన్​ కోసం మరిన్ని ప్రత్యేక రైళ్లు!

Indian Railways announces special trains : పండుగ సీజన్​లో రద్దీని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది భారతీయ రైల్వే. 179 జతల రైళ్లతో.. ఈ ఏడాది ఛత్​ పూజ సమయం వరకు 2,269 ట్రిప్పులు నిర్వహించనున్నట్టు వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఢిల్లీ- పట్నా, ఢిల్లీ- భగల్​పూర్​, ఢిల్లీ- ముజాఫర్​పూర్​, ఢిల్లీ-సహస్రతో పాటు ఇతర రూట్​లలో ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది భారతీయ రైల్వే.

ఆగస్టు 31న వినాయక చవితితో మొదలైన పండుగ సీజన్​.. ఈ నెల 30న జరగనున్న ఛత్​ పూజతో ముగుస్తుంది. ఈ మధ్యలో దసరా ఉత్సవాలు జరిగాయి. దీపావళి కూడా వస్తోంది. ఈ నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది భారతీయ రైల్వే.

ప్రత్యేక రైళ్లు..

Special trains details : సెంట్రల్​ రైల్వే(సీఆర్​) నుంచి 7 జతల్లో 100 ట్రిప్పుల ప్రత్యేక రైళ్లు నడుస్తాయి.

ఈస్ట్​ సెంట్రల్​ రైల్వే(ఈసీఆర్​) నుంచి 9 జతల ప్రత్యేక రైళ్లు 128 ట్రిప్పులు నిర్వహిస్తాయి.

ఈస్టర్న్​ రైల్వే(ఈఆర్​) నుంచి 14 జతల ప్రత్యేక రైళ్లు 108 ట్రిప్పులు నడుస్తాయి.

నార్తెన్​ రైల్వే(ఎన్​ఈ) నుంచి 35 జతల రైళ్లు 368 ట్రిప్పులు నిర్వహిస్తాయి.

నార్త్​ సెంట్రల్​ రైల్వే(ఎన్​సీఆర్​) నుంచి 8 జతల రైళ్లు.. 223 ట్రిప్పులు నడుస్తాయి.

నార్త్​ ఈస్టర్న్​ రైల్వే(ఎన్​ఈఆర్​) నుంచి 2 జతల రైళ్లు.. 34 ట్రిప్పులు వేస్తాయి.

నార్త్​ ఫ్రాంటియర్​ రైల్వే(ఎన్​ఎఫ్​ఆర్​) నుంచి 4 జతల రైళ్లు.. 134 ట్రిప్పులు నడుస్తాయి.

సథర్న్​ రైల్వే(ఎస్​ఆర్​) నుంచి 2 జతల రైళ్లు(14 ట్రిపుపులు), సథర్న్​ సెంట్రల్​ రైల్వే(ఎస్​సీఆర్​) నుంచి 19 జతల రైళ్లు(191 ట్రిప్పులు) ఉంటాయి.

సౌత్​ వెస్టర్న్​ రైల్వే(ఎస్​డబ్ల్యూఆర్​) నుంచి 22 ప్రత్యేక రైళ్లు.. 433 ట్రిప్పులు వేస్తాయి.

వెస్ట్​ సెంట్రల్​ రైల్వే(డబ్ల్యూసీఆర్​) నుంచి 6 జతల రైళ్లు 16 ట్రిప్పులు నడుస్తాయి.

వెస్టర్న్​ రైల్వే(డబ్ల్యూఆర్​) నుంచి 18 జతల రైళ్లు 306 ట్రిప్పులు వేస్తాయి.

రైల్వే ప్రకటన ప్రకారం.. ప్రయాణికుల భద్రత కోసం ఆర్​పీఎఫ్​ సిబ్బందిని ప్రధాన రైల్వే స్టేషన్లలో మోహరించారు.

తదుపరి వ్యాసం