Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్ లో స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
12 March 2024, 20:39 IST
Indian Bank Recruitment 2024: 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు మార్చి 12వ తేదీ నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసుకోవడానికి చివరి తేదీ ఏప్రిల్ 1.
ప్రతీకాత్మక చిత్రం
Indian Bank Recruitment 2024: ఇండియన్ బ్యాంక్ 146 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. దరఖాస్తు ప్రక్రియ మార్చి 12న ప్రారంభమవుతుందని, దరఖాస్తు ఫారం సమర్పించడానికి చివరి తేదీ ఏప్రిల్ 1 అని ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులైన అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.175. మిగతా అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000.
ఇండియన్ బ్యాంక్ రిక్రూట్మెంట్ 2024 ఖాళీల వివరాలు: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా 146 స్పెషలిస్ట్ ఆఫీసర్స్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఇలా అప్లై చేయండి..
- ముందుగా ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్సైట్ www.indianbank.in ను ఓపెన్ చేయండి.
- హోం పేజీలో కనిపించే career tab పై క్లిక్ చేయండి.
- "స్పెషలిస్ట్ ఆఫీసర్ల రిక్రూట్మెంట్ - 2024" పై క్లిక్ చేయండి.
- స్క్రీన్ పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- "Click here for New Registration" లింక్ పై క్లిక్ చేయండి.
- రిజిస్టర్ చేసుకుని, అప్లికేషన్ ఫామ్ ను ఫిలప్ చేయండి.
- అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్లోడ్ చేయండి.
- ఆన్ లైన్ లో ఫీజు చెల్లించండి.
- భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ఫామ్ ను ప్రింట్ తీసుకోండి.