తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Contributes To Counter Terrorism Fund: ఉగ్రవాదంపై పోరుకు భారత్ భారీ విరాళం

India contributes to Counter Terrorism fund: ఉగ్రవాదంపై పోరుకు భారత్ భారీ విరాళం

HT Telugu Desk HT Telugu

29 October 2022, 15:31 IST

google News
  • India contributes to Counter Terrorism fund: ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఉగ్రవాద వ్యతిరేక కార్యక్రమాల కోసం UN Trust Fund for Counter Terrorism కు భారత్ 5 లక్షల డాలర్ల విరాళాన్ని ప్రకటించింది. భారత్ లో జరుగుతున్న ఐరాస భద్రత మండలి ప్రత్యేక సమావేశంలో విదేశాంగ మంత్రి జై శంకర్ ఈ విషయాన్ని వెల్లడించారు.

ఘనా విదేశాంగ మంత్రి షిర్లీ తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్
ఘనా విదేశాంగ మంత్రి షిర్లీ తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్ (PTI)

ఘనా విదేశాంగ మంత్రి షిర్లీ తో భారత విదేశాంగ మంత్రి జై శంకర్

India contributes to Counter Terrorism fund: సభ్య దేశాల్లో ఉగ్రవాద వ్యతిరేక మౌలిక వసతుల కల్పన, ఉగ్రవాదంపై పోరుకు అవసరమైన నైపుణ్యాల పెంపు తదితరాల కోసం ఈ నిధులను ఉపయోగించాలని భారత్ కోరింది.

India contributes to Counter Terrorism fund: టెక్నాలజీ సాయంతో..

ఉగ్రవాద సంస్థలు టెక్నాలజీ సాయంతో మరింత విధ్వంసానికి కుట్ర చేసే అవకాశముందని, వారి టూల్ కిట్ లో ఇప్పుడు సోషల్ మీడియా కూడా చేరిందని జై శంకర్ హెచ్చరించారు. న్యూఢిల్లీ లో శనివారం జరిగిన కౌంటర్ టెర్రరిజం కమిటీ ప్లీనరీలో ఆయన కీలక ప్రసంగం చేశారు. ‘ఉగ్రవాద కార్యకలాపాల కోసం ఉగ్రవాద సంస్థలు నూతన, అధునాతన టెక్నాలజీలను ఉపయోగించకుండా అడ్డుకోవడం’ అనే అంశంపై రెండు రోజుల పాటు ఈ ప్లీనరీ జరుగుతోంది.

India contributes to Counter Terrorism fund: ముప్పు తగ్గలేదు..

ఉగ్రవాద ముప్పు ప్రపంచవ్యాప్తంగా రోజురోజుకూ పెరుగుతోందని జైశంకర్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా, ఆసియా, ఆఫ్రికా దేశాల్లో ఇది గణనీయంగా పెరుగుతోందన్నారు. ఈ విషయంలో ఐరాస భద్రత మండలి చేపట్టిన చర్యలు సరైన ఫలితాలను ఇవ్వడం లేదన్నారు. మానవాళి ముందున్న అతిపెద్ద ముప్పు ఉగ్రవాదమేనని జైశంకర్ వ్యాఖ్యానించారు.

India contributes to Counter Terrorism fund: ఉగ్ర సంస్థల సాంకేతికతలపై దృష్టి

ఉగ్రవాదా సంస్థలు నూతన, ఆధునిక సాంకేతికలను ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని, వాటికి సాంకేతిక, ఆర్థిక సాయం అందిస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వేతర కేంద్రాలపై దృష్టి పెట్టాలని జై శంకర్ సూచించారు.

తదుపరి వ్యాసం