తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Arunachal Pradesh : అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్​ ఫైర్​

Arunachal Pradesh : అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్​ ఫైర్​

Sharath Chitturi HT Telugu

07 April 2023, 7:45 IST

google News
  • China renames places in Arunachal Pradesh : భారత్​తో సరిహద్దు వివాదాన్ని మరింత తీవ్రం చేసే విధంగా చైనా తాజాగా ఓ ప్రకటన చేసింది. అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లను మార్చేసింది. దీనిని ఇండియా తీవ్రంగా ఖండించింది.

అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్​ ఫైర్​
అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్​ ఫైర్​ (Border Road Organisation Twitter)

అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 ప్రాంతాల పేర్లు మార్చిన చైనా.. భారత్​ ఫైర్​

China renames places in Arunachal Pradesh : అరుణాచల్​ ప్రదేశ్​లోని 11 పేర్లను మారుస్తున్నట్టు చైనా ప్రకటించింది. ఈ వ్యవహారంపై భారత ప్రభుత్వం అసంతృప్తి, ఆందోళన వ్యక్తం చేసింది. చైనా చర్యలను ఖండించింది. అప్పటికి, ఇప్పటికి, ఎప్పటికి.. అరుణాచల్​ ప్రదేశ్​ రాష్ట్రం భారత్​లో అంతర్గత భాగమే అని తేల్చిచెప్పింది.

చైనా.. మరో కుట్ర..!

టిబెట్​తో పాటు అరుణాచల్​ ప్రదేశ్​ కూడా తమ భూమిలో భాగమేనని చైనా చెబుతూ వస్తోంది. అరుణాచల్​ ప్రదేశ్​ను 'జాంగ్నన్​- టిబెట్​లోని దక్షిణ భాగం'గా సంబోధిస్తుంది చైనా. ఇక ఇప్పుడు రాష్ట్రంలోని 11 ప్రాంతాల పేర్లను మార్చేసింది. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ఇలా.. అరుణాచల్​ ప్రదేశ్​లోని ప్రాంతాల పేర్లను చైనా మార్చడం ఇది మూడోసారి. 2018, 2021లో కొన్ని ప్రాంతాల పేర్లు మార్చింది. 2018లో ఆరు, 2021లో ఏకంగా 15 ప్రాంతాల పేర్లు మార్చేసింది.

Arunachal Pradesh latest news : తాజాగా.. అరుణాచల్​ ప్రదేశ్​లోని 5 పర్వతాల శిఖరాలు, 2 భూభాగాలు, రెండు నివాసిత ప్రాంతాలు, రెండు నదుల పేర్లను తాజాగా మార్చింది చైనా.

'పేర్లు మారిస్తే.. ఏం మారిపోదు..'

చైనా వ్యవహారంపై భారత్​ ఘాటుగా స్పందించింది. పేర్లు మార్చినంత మాత్రాన.. వాస్తవం అన్నది మారిపోదని పేర్కొంది.

China India border dispute : "చైనా నివేదికను మేము చూశాము. ఇలాంటి పనులు చేయడం చైనాకు ఇది కొత్తేమీ కాదు. దీనిని మేము ఖండిస్తున్నాము. అరుణాచల్​ ప్రదేశ్​ ఎప్పటికీ.. ఇండియా భూమిలో భాగమే. కొత్త కొత్త పేర్లు సృష్టించి పెట్టేసినంత మాత్రాన వాస్తవాన్ని ఎవరూ మార్చలేరు," అని భారత విదేశాంగశాఖ ప్రతినిధి ఆరిందమ్​ బగ్చి తెలిపారు.

చైనాతోనే ఉద్రిక్తత..!

1950లో టిబెట్​ను సైనిక శక్తితో స్వాధీనం చేసుకుంది చైనా. 1959లో దలైలామా.. టిబెట్​ను విడిచి అరుణాచల్​ప్రదేశ్​ మార్గంలో ఇండియాకి చేరారు. అప్పటి నుంచి ఇండియాలోనే ఆశ్రయం పొందుతున్నారు.

India China relation : ఇక గతేడాది డిసెంబర్​లో అరుణాచల్​ ప్రదేశ్​ తవాంగ్​ సెక్టార్​లోని వాస్తవాధీన రేఖ (ఎల్​ఏసీ) సమీపంలో చైనా- భారత్​ సైనికుల మధ్య ఘర్షణ జరిగింది. చైనా దళాలను భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది.

తదుపరి వ్యాసం