తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Mother Of All Democracies: `అమ్మ వంటి ప్ర‌జాస్వామ్యం మ‌న‌ది`

India mother of all democracies: `అమ్మ వంటి ప్ర‌జాస్వామ్యం మ‌న‌ది`

HT Telugu Desk HT Telugu

12 July 2022, 23:06 IST

google News
  • India mother of all democracies: ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ మంగ‌ళ‌వారం బిహార్ అసెంబ్లీ శ‌తాబ్ది ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఒక స్మార‌క చిహ్నాన్ని ఆవిష్క‌రించారు. క‌ల్ప‌త‌రు మొక్క‌ను నాటారు. అసెంబ్లీ భ‌వ‌నంలో గెస్ట్‌హౌజ్‌, లైబ్ర‌రీల‌కు శంకుస్తాప‌న చేశారు.

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ (PTI)

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

బిహార్ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ భార‌త ప్ర‌జాస్వామ్యంపై ప్ర‌శంస‌లు కురిపించారు. భార‌త ప్ర‌జాస్వామ్యం, మిగ‌తా అన్ని దేశాల్లోని ప్ర‌జాస్వామ్యాల‌కు త‌ల్లి వంటిద‌ని అభివ‌ర్ణించారు.

India mother of all democracies: బిహార్ ప‌ర్య‌ట‌న‌

బిహార్‌లో మంగ‌ళ‌వారం ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌టించారు. అక్క‌డి అసెంబ్లీ శ‌తాబ్ది ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్బంగా మాట్లాడుతూ.. భార‌త ప్ర‌జాస్వామ్యం గొప్ప‌ద‌నాన్ని వివ‌రించారు. వైశాలి వంటి పురాత‌న గ‌ణ‌తంత్రాల వార‌స‌త్వంగా భార‌త ప్ర‌జాస్వామ్యం ఏర్ప‌డింద‌న్నారు. అన్ని ప్ర‌జాస్వామ్యాల‌కు భార‌త ప్ర‌జాస్వామ్యం త‌ల్లి వంటిద‌న్నారు. ప‌రిపూర్ణ ప్ర‌జాస్వామ్యం దిశ‌గా భార‌త్ చేస్తున్న ప్ర‌స్థానంపై ఆయ‌న సంతృప్తి వ్య‌క్తం చేశారు.

India mother of all democracies: తొలి ప్ర‌ధాని

బిహార్ అసెంబ్లీని సంద‌ర్శించిన తొలి ప్ర‌ధాని తానే కావ‌డం గ‌ర్వంగా ఉంద‌ని ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ వ్యాఖ్యానించారు. భార‌త్‌ ప్ర‌పంచంలో అతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశ‌మే కాదు.. మిగ‌తా ప్ర‌జాస్వామ్యాల‌కు త‌ల్లివంటి ప్ర‌జాస్వామ్య‌మ‌ని అభివ‌ర్ణించారు. భార‌త ప్ర‌జ‌ల్లో సామ‌ర‌స్య భావ‌న ఉన్నందువ‌ల్ల‌నే దేశంలో ప్ర‌జాస్వామ్యం కొన‌సాగుతోంద‌న్నారు. బిహార్ ప్రాంతంలో ఒక‌ప్పుడు ప‌రిఢ‌విల్లిన వైశాలి గ‌ణ‌తంత్రం ప్ర‌పంచంలోనే తొలి గ‌ణ‌తంత్రంగా ప్ర‌సిద్ధి గాంచింద‌ని గుర్తు చేశారు. పాశ్చాత్య ప్ర‌భావంతోనే భార‌త్‌లో ప్ర‌జాస్వామ్యం వ‌చ్చింద‌న్న వాద‌న‌ను ప్ర‌ధాని మోదీ తోసిపుచ్చారు. అంత‌కు చాన్నాళ్ల క్రిత‌మే ఇక్క‌డ వైశాలి గ‌ణ‌తంత్రం వ‌ర్ధిల్లింద‌ని గుర్తు చేశారు.

తదుపరి వ్యాసం