తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Has Over 1.2 Bn Mobile Phone Users: 120 కోట్లు దాటిన మొబైల్ యూజర్ల సంఖ్య

India has over 1.2 bn mobile phone users: 120 కోట్లు దాటిన మొబైల్ యూజర్ల సంఖ్య

HT Telugu Desk HT Telugu

16 November 2022, 21:17 IST

google News
  • India has over 1.2 bn mobile phone users: భారత్ లో మొబైల్ ఫోన్ల ను వాడే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశవ్యాప్తంగా 120 కోట్ల మొబైల్ ఫోన్ యూజర్లు ఉన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

India has over 1.2 bn mobile phone users: చవకగా లభించే స్మార్ట్ ఫోన్లు, డేటా, సోషల్ మీడియా విస్ఫోటనం, పెరుగుతున్న యువ జనాభా కారణంగా భారత్ లో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగింది.

India has over 1.2 bn mobile phone users: 120 కోట్ల మొబైల్ ఫోన్ వినియోగదారులు

భారత్ లో ప్రస్తుతం 120 కోట్ల మంది మొబైల్ ఫోన్ ను వాడుతున్నారని కేంద్ర సమాచార ప్రసార శాఖ వెల్లడించింది. వారిలో సగం అంటే, దాదాపు 60 కోట్ల మంది స్మార్ట్ ఫోన్స్ ను వాడుతున్నారని సమాచార ప్రసార శాఖ కార్యదర్శి అపూర్వ చంద్ర తెలిపారు. మొబైల్ ఫోన్ల ద్వారా సమాచారం, వినోదం పొందే వినియోగదారుల సంఖ్య భారీగా పెరిగిందని, చవకగా లభించే స్మార్ట్ ఫోన్లు, దాదాపు ఉచితంగానే లభిస్తున్న డేటా అందుకు కారణమని పేర్కొన్నారు.

India has over 1.2 bn mobile phone users: సొషల్ మీడియా ప్రభావం

‘సమాచార విస్తృతితో సోషల్ మీడియా పాత్ర గణనీయం. సామాజిక మాధ్యమాలతో లాభాలతో పాటు అంతే స్థాయిలో నష్టాలు ఉన్నాయి. ప్రకృతి విపత్తులు, ఇతర ప్రమాదాల సమయంలో త్వరిగత గతిన సమాచారాన్ని అందించడం ఈ మీడియా ద్వారా సాధ్యమైంది. అదే సమయంలో, విద్వేష, తప్పుడు సమాచార ప్రచారానికి కూడా ఇది ఉపయోగపడుతోంది’ అని యూఏఈ(United Arab Emirates) లోని అబూదాబిలో జరుగుతున్న తొలి వరల్డ్ మీడియా కాంగ్రెస్(World Media Congress) లో ప్రసంగిస్తూ అపూర్వ వెల్లడించారు.

India has over 1.2 bn mobile phone users: మొత్తం 897 టీవీ చానెళ్లు

భారత్ లో మీడియా విస్తృతి గురించి అపూర్వ చంద్ర ఆ సమావేశంలో సమగ్రంగా వివరించారు. భారత్ లో మొత్తం 897 టీవీ చానెళ్లు ఉన్నాయని, అందులో 350 న్యూస్ చానెళ్లని వెల్లడించారు. అలాగే, భారత్ లోని అన్ని భాషల్లో కలిపి సుమారు 80 వేల వార్తా పత్రికలు ప్రచురితమవుతున్నాయని తెలిపారు. కొత్తగా డిజిటల్ మీడియా ప్రభంజనం ప్రారంభమైందన్నారు.

తదుపరి వ్యాసం