Economic survey | 8-8.5 శాతం మధ్య వృద్ధి రేటు అంచనాలు
31 January 2022, 13:18 IST
- వచ్చే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8-8.5 శాతం మధ్య ఉంటుందని వార్షిక ఎకనమిక్ సర్వే వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అంచనా వేసిన 9.2 శాతం వృద్ధి రేటు కంటే ఇది తక్కువ.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (ఫైల్ ఫోటో)
న్యూఢిల్లీ: ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమయ్యే 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వృద్ధి రేటు 8-8.5 శాతం మధ్య ఉంటుందని వార్షిక ఆర్థిక సర్వే అంచనా వేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎకనమిక్ సర్వేను సోమవారం మధ్యాహ్నం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బడ్జెట్ సమావేశాలు ప్రారంభమైన తొలిరోజు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఈ ప్రసంగం ముగిసిన వెంటనే కొలువుదీరిన లోక్ సభలో ఆర్థిక మంత్రి ఎకనమిక్ సర్వే ప్రవేశపెట్టారు. వచ్చే ఏడాది వృద్ధి రేటు అంచనాలు.. ఈ ఆర్థిక సంవత్సర అంచనాల కంటే తక్కువగా ఉన్నాయని సర్వే వెల్లడించింది. అన్ని స్థూల సూచికలు ఆర్థిక వ్యవస్థ సవాళ్లను ఎదుర్కోవడానికి బాగానే ఉన్నాయని సూచించాయి. వ్యవసాయ, పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధి ఇందుకు సాయపడిందని నివేదిక వెల్లడించింది.