first intranasal Covid vaccine: ముక్కు ద్వారా కోవిడ్ వాక్సిన్.. డీసీజీఐ అనుమతి
06 September 2022, 15:13 IST
- first intranasal Covid vaccine: ఇంట్రానాజల్ కోవిడ్ వాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి లభించింది.
భారత్ బయోటెక్ రూపొందించిన నాజల్ వాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి (AFP)
భారత్ బయోటెక్ రూపొందించిన నాజల్ వాక్సిన్‌కు డీసీజీఐ అనుమతి
first intranasal Covid vaccine: భారత దేశపు తొలి ఇంట్రా నాజల్ కోవిడ్ వాక్సిన్‌కు డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతి లభించింది. కోవిడ్‌కు ప్రాథమిక రోగ నిరోధకతగా ఇది పనిచేస్తుంది. భారత్ బయోటెక్ దీనిని రూపొందించింది.
సీడీఎస్‌సీవో అనుమతి లభించిన తరువాత కేంద్ర ఆరోగ్య మంత్రి డాక్టర్ మన్‌సుఖ్ మాండవీయ దీనిపై స్పందిస్తూ కోవిడ్-19కు వ్యతిరేకంగా భారత దేశం చేస్తున్న పోరాటానికి దీని ద్వారా గొప్ప మద్దతు లభించినట్టయిందని అన్నారు.
కోవిడ్ -19 నాసల్ వాక్సిన్‌ను ప్రాథమిక రోగ నిరోధకత కోసం 18 ఏళ్లపైబడిన వయస్సు గ్రూపుల వారికి ఇచ్చేందుకు సీడీఎస్‌సీవో ఇండియా అనుమతి ఇచ్చింది.
టాపిక్