తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Jaishankar Attack On Pakistan: పాకిస్థాన్‍కు బుద్ధి చెప్పిన భారత్.. లాడెన్ పేరును ప్రస్తావిస్తూ..

Jaishankar attack on Pakistan: పాకిస్థాన్‍కు బుద్ధి చెప్పిన భారత్.. లాడెన్ పేరును ప్రస్తావిస్తూ..

15 December 2022, 12:30 IST

google News
    • Jaishankar attack on Pakistan: ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి వేదికగా పాకిస్థాన్‍కు భారత్ గట్టి సమాధానం చెప్పింది. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తిన పాక్‍కు బుద్ధి చెప్పింది.
Jaishankar attack on Pakistan: పాకిస్థాన్‍కు బుద్ధి చెప్పిన భారత్
Jaishankar attack on Pakistan: పాకిస్థాన్‍కు బుద్ధి చెప్పిన భారత్ (ANI)

Jaishankar attack on Pakistan: పాకిస్థాన్‍కు బుద్ధి చెప్పిన భారత్

Jaishankar attack on Pakistan: ఐక్యరాజ్య సమితి వేదికగా పాకిస్థాన్‍కు భారత్ మరోసారి బుద్ధిచెప్పింది. యూఎన్ భద్రతా మండలి (United Nations Security Council)లో కశ్మీర్ అంశాన్ని మరోసారి ప్రస్తావించిన పాక్‍కు దీటైన సమాధానం చెప్పింది. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం ఆపాలని హితవు పలికింది. ఒసామా బిన్ లాడెన్ లాంటి కరడుగట్టిన ఉగ్రవాదికి అశ్రయం ఇచ్చిన, పక్క దేశ పార్లమెంటుపై దాడి చేసిన దేశానికి ఐక్యరాజ్య సమితి లాంటి ప్రపంచ వేదికపైన నీతులు చెప్పే అర్హత లేనేదని భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో చర్చ జరుగుతుండగా.. పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి బిలావల్ భుట్టో కశ్మీర్ విషయాన్ని లేవనెత్తారు. దీంతో జైశంకర్ కల్పించున్నారు. పాకిస్థాన్‍తో పాటు చైనాపై కూడా పరోక్ష విమర్శలు చేశారు. ఉగ్రవాదానికి ఊతమిస్తున్న వారిని రక్షిస్తున్న దేశాలు అంటూ ఘాటుగా బదులిచ్చారు. పూర్తి వివరాలు..

ఉగ్రవాదాన్ని సమర్థించడమా..!

ప్రపంచం మొత్తం వ్యతిరేకిస్తున్న ఉగ్రవాదాన్ని కొన్ని దేశాలు సమర్థిస్తున్నాయంటూ భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్.. పాకిస్థాన్, చైనాపై పరోక్ష విమర్శలు చేశారు. కొన్ని దేశాలు ఉగ్రవాదానికి ఆశ్రయమిస్తూ… అంతర్జాతీయ వేదికలను దుర్వినియోగం చేస్తున్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలను పరిష్కరించేందుకు అత్యుత్తమ మార్గాలను అన్వేషించే సమయంలో ఎలాంటి ప్రమాదాన్ని తేలికగా తీసుకోకూడదు అంటూ పాకిస్థాన్‍కు నేరుగా తాకేలా మాట్లాడారు. “మహమ్మారి, వాతావరణ మార్పులు, వివాదాలు, ఉగ్రవాదం.. ఇలా ఏ సవాలుపై అయినా సమర్థవంతమైన ప్రతిస్పందన చూపడం ద్వారానే ఐక్యరాజ్య సమితి విశ్వసనీయత ఆధారపడి ఉంటుంది” అని జైశంకర్ అన్నారు. అంటే ఉగ్రవాదంపై కఠినంగా వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

పాక్ ఇకనైనా ఆపాలి

జమ్ము కశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు అంశాన్ని జైశంకర్ మరోసారి ప్రస్తావించారు. ఇది భారత అంతర్గత వ్యవహారమని, ఎవరూ జోక్యం చేసుకోకూడదని స్పష్టం చేశారు. పాకిస్థాన్ ఇప్పటికైనా ఈ విషయాన్ని గ్రహించి.. భారత్‍పై చేస్తున్న దుష్ప్రచారాన్ని ఆపాలని హితవు పలికారు.

కశ్మీర్‌లో 370 ఆర్టికల్ రద్దు చేయడం ద్వారా మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ పాకిస్థాన్ దుష్ప్రచారం చేస్తోంది. ఈ విషయాన్ని పదేపదే ప్రపంచ వేదికలపై ప్రస్తావిస్తోంది. దీనిపై పాకిస్థాన్‍కు భారత్ ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే ఉంది.

తదుపరి వ్యాసం