తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Assumes G20 Presidency: జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

India assumes G20 presidency: జీ 20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన భారత్

HT Telugu Desk HT Telugu

01 December 2022, 22:15 IST

  • India assumes G20 presidency: ప్రతిష్టాత్మక జీ 20 అధ్యక్ష బాధ్యతలను గురువారం భారత్ లాంఛనంగా స్వీకరించింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, మనిషి కేంద్రంగా గ్లోబలైజేషన్ దిశగా ఆలోచనల్లో  మార్పు రావాలని పిలుపునిచ్చారు. 

జీ 20 లోగోతో పూరిలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం
జీ 20 లోగోతో పూరిలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం (PTI)

జీ 20 లోగోతో పూరిలో సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం

India assumes G20 presidency: జీ 20(G20) అధ్యక్ష బాధ్యతలను భారత్ స్వీకరించింది. ఈ బాధ్యతలను భారత్ సంవత్సరం పాటు నిర్వర్తించనుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ, ప్రాథమికంగా, మన ఆలోచనా ధోరణిలోనే మార్పు రావాలని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయీకరణ అనేది మనిషి కేంద్రంగా జరగాలని, ఆ దిశగా ఆలోచనల్లో మార్పు రావాలని పిలుపునిచ్చారు.

ట్రెండింగ్ వార్తలు

Jammu and Kashmir news: భద్రతా బలగాలపై ఉగ్రవాదుల కాల్పులు; ఐదుగురు జవాన్లకు గాయాలు

IGNOU July 2024 session: ఇగ్నో లో జులై సెషన్ కు రీ రిజిస్ట్రేషన్ విండో ఓపెన్; విద్యార్థులు ఇలా రిజిస్టర్ చేసుకోండి..

NEET UG 2024: రేపే నీట్ యూజీ 2024 పరీక్ష; డ్రెస్ కోడ్ ఉంది, షూస్ వేసుకోవద్దు; గమనించండి..

Japan rice balls : చంకలో పెట్టి.. చెమటతో తయారు చేసిన ఈ ఫుడ్​ని ఎగబడి తింటున్నారు!

India assumes G20 presidency: అంతర్జాతీయ పత్రికల్లో ఆర్టికల్

జీ 20(G20) అధ్యక్షతకు శ్రీకారం చుడుతున్న సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ప్రముఖ పత్రికల్లో ప్రధాని మోదీ రాసిన వ్యాసం ప్రచురితమైంది. అందులో ఆయన మరోసారి భారతీయ భావన అయిన ’వసుధైక కుటుంబం’ను మరోసారి ప్రస్తావించారు. ప్రపంచమంతా ఒకే కుటుంబమన్న భావన భారతీయులదన్నారు. ‘ఒకే ప్రపంచం, కుటుంబం, ఒకే భవిత’ అనేదే తమ సిద్ధాంతమన్నారు. ఉగ్రవాదం, వాతావరణ మార్పు, కరొనా వంటి మహమ్మారులు.. తదితర సమస్యలను ఒంటరిగా కన్నా ఐక్యంగా ఎదుర్కోవడం అభిలషణీయమన్నారు. సంకుచిత భావనలను ప్రపంచ దేశాలు విడనాడాలన్నారు.

India assumes G20 presidency: అన్ని దేశాలను సంప్రదిస్తాం..

జీ 20(G20) సభ్య దేశాలను మాత్రమే కాకుండా, ఇతర ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా దేశాలను కూడా సంప్రదించిన తరువాతనే జీ 20(G20) ప్రాధాన్యతలను నిర్ణయిస్తామని మోదీ వెల్లడించారు. ప్రపంచ వేదికలపై పెద్దగా స్వరం వినిపించని దేశాలకు ఈ సంవత్సరం జీ 20 గొంతుకగా నిలుస్తుందన్నారు. టీకాలు, ఔషధాలు, ఆహారం, ఎరువులు వంటి నిత్యావసరాలు అన్ని దేశాలకు అందాల్సి ఉందన్నారు. అందరూ బావుండాలంటే, అన్ని దేశాలు వృద్ధి చెందాలంటే, భారత్ విశ్వసించే పంచ భూతాలైన గాలి, భూమి, నీరు, నిప్పు, ఆకాశం లను సమిష్టిగా, సమర్ధవంతంగా వినియోగించుకోవాలని సూచించారు.