తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  '‘అదానీ’ కోసం శ్రీలంకపై ప్రధాని మోదీ ఒత్తిడి?'

'‘అదానీ’ కోసం శ్రీలంకపై ప్రధాని మోదీ ఒత్తిడి?'

Sharath Chitturi HT Telugu

13 June 2022, 17:02 IST

    • శ్రీలంకలో ఓ పవర్​ ప్రాజెక్ట్​ చుట్టూ వివాదం రాజుకుంది. ఆ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్​నకు ఇవ్వాలంటూ ప్రధాని మోదీ.. శ్రీలంక అధ్యక్షుడిపై ఒత్తిడి తెచ్చారని ఓ అధికారి వ్యాఖ్యానించారు. ఆ తర్వాత కొన్ని రోజులకే ఆయన పదవి నుంచి తప్పుకున్నారు!
ప్రధాని నరేంద్ర మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ (REUTERS/file)

ప్రధాని నరేంద్ర మోదీ

శ్రీలంకలోని పవర్​ ప్రాజెక్టులు అదానీ గ్రూప్​నకు దక్కే విధంగా చూడాలని ఆ దేశాధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ప్రధాని మోదీ ఒత్తిడి తెచ్చారంటూ ఓ అధికారి చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టించాయి. కాగా.. ఈ వ్యాఖ్యలు చేసిన మూడు రోజులకే.. ఆ అధికారి తన పదవి నుంచి తప్పుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

ఇదీ వివాదం..

శ్రీలంకలోని మన్నర్​ జిల్లాలో.. 500మెగావాట్ల రినవెబుల్​ ఎనర్జీ ప్రాజెక్టును నిర్మించాల్సి ఉంది. దీనితో పాటు 10మెగా వాట్ల ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్టు.. భారత్​కు చెందిన అదానీ గ్రూప్​నకు గతేడాది డిసెంబర్​లో దక్కిందని వార్తలొచ్చాయి.

కాగా.. ఈ ప్రాజెక్టు చుట్టూ గత కొంత కాలంగా ఎన్నో వివాదాలు రాజుకున్నాయి. ఇటీవలి కాలంలో ఈ వివాదం మరోమారు వార్తల్లో నిలిచింది. శ్రీలంక పార్లమెంట్​లో ఈ ప్రాజెక్టుపై చర్చ జరిగింది. అక్కడి ప్రభుత్వం.. ఎనర్జీ ప్రాజెక్టుకు సంబంధించిన బిడ్డింగ్​ ప్రక్రియను తొలగించేందుకు బిల్లు ప్రవేశపెట్టింది. విపక్షాల నిరసనల మధ్య ఈ బిల్లు పార్లమెంట్​లో గట్టెక్కింది. కాగా.. అదానీ గ్రూప్​నకు ఈ ప్రాజెక్టును ఇచ్చేందుకే.. బిడ్డింగ్​ ప్రక్రియను తొలగించిందని విపక్షాలు మండిపడ్డాయి. బిడ్డింగ్​ను తిరిగి ప్రవేశపెట్టాలన్న వారి డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు!

కాగా.. గత శుక్రవారం ఈ వివాదం తీవ్ర రూపం దాల్చింది. ఎనర్జీ ప్రాజెక్టు.. అదానీ గ్రూప్​నకు దక్కెట్టు చూడాలని.. శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఒత్తిడి తీసుకొచ్చారని ఓ ఉన్నతాధికారి వ్యాఖ్యలు చేయడం తీవ్ర దుమారానికి దారితీసింది.

"ప్రధాని మోదీ.. తనను ఒత్తిడి చేస్తున్నారని రాజపక్స నాతో చెప్పారు. అదానీ గ్రూప్​నకు ఆ ప్రాజెక్టు ఇవ్వాలని మోదీ అడుగుతున్నారట," అని.. సీఈబీ(సిలోన్​ ఎలక్ట్రిసిటీ బోర్డు) ఛైర్మన్​ ఎంఎంసీ ఫెర్డినాండో అన్నారు. సీఓపీఈ(కమిటీ ఆన్​ పబ్లిక్​ ఎట్రిప్రైజెస్​)కి చెందిన కార్యక్రమంలో భాగంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఫెర్డినాండో వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. ఈ వ్యవహారంపై గొటబాయ రాజపక్స వివరణ ఇవ్వాల్సి వచ్చింది.

"ఫెర్డినాండో వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నాను. ఒక వ్యక్తికి లేదా సంస్థకు.. ఆ ప్రాజెక్టు కేటాయించాలని నేను ఎవరికి, ఎప్పుడు చెప్పలేదు. నాపై ఎలాంటి ఒత్తిడి లేదు," అని రాజపక్స స్పష్టం చేశారు.

"శ్రీలంకలో ప్రస్తుతం తీవ్ర విద్యుత్​ కొరత ఉంది. దానిని పరిష్కరించేందుకు మెగా పవర్​ ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని ఆయన భావిస్తున్నారు. కానీ ఈ వ్యవహారంలో ఆయనపై ఎలాంటి ఒత్తిడి లేదు," అని అధ్యక్షుడి కార్యాలయం ఓ ప్రకటనను విడుదల చేసింది.

ఒక రోజు తర్వాత.. తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పారు ఫెర్డినాండో. తీవ్ర భావోద్వేగం, తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో అనుకోకుండా ప్రధాని మోదీ పేరు వచ్చిందని వివరణ ఇచ్చారు.

ఈ వ్యవహారం జరిగిన అనంతరం.. ఫెర్డినాండో.. సోమవారం తన పదవి నుంచి తప్పుకున్నారు.

తదుపరి వ్యాసం