తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iiit Lucknow: ఐఐఐటీ లక్నోలో ఎంబీఏ డిజిటల్ బిజినెస్ కోర్సు; వివరాలు ఇవే..

IIIT Lucknow: ఐఐఐటీ లక్నోలో ఎంబీఏ డిజిటల్ బిజినెస్ కోర్సు; వివరాలు ఇవే..

HT Telugu Desk HT Telugu

08 January 2024, 19:01 IST

google News
  • IIIT Lucknow: భారత్ లోని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఒకటైన ఐఐఐటీ లక్నో (IIIT Lucknow)లో తాజాగా ఎంబీఏ డిజిటల్ బిజినెస్ (MBA (Digital Business) కోర్సు ప్రారంభమైంది. 

ఐఐఐటీ లక్నో క్యాంపస్
ఐఐఐటీ లక్నో క్యాంపస్

ఐఐఐటీ లక్నో క్యాంపస్

MBA (Digital Business) in IIIT Lucknow: లక్నో లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indian Institute of Information Technology) కాలేజీలో కొత్తగా ఎంబీఏ (డిజిటల్ బిజినెస్) కోర్సును ప్రారంభించారు. డిజిటల్ బిజినెస్ లో శరవేగంగా చోటు చేసుకుంటున్న విప్లవాత్మక మార్పుల నేపథ్యంలో భవిష్యత్ తరాలను అందుకు సిద్ధం చేసే లక్ష్యంతో ఈ కోర్సును ప్రారంభిస్తున్నట్లు ఐఐఐటీ లక్నో వెల్లడించింది. ఈ MBA (Digital Business) కోర్సు ద్వారా బిజినెస్ మేనేజ్ మెంట్ లో, టెక్నాలజీలో కెరియర్ ను ప్లాన్ చేసుకోవచ్చని తెలిపింది.

MBA (Digital Business) in IIIT Lucknow: సీయూఈటీ ద్వారా..

ఐఐఐటీ లక్నో (IIIT Lucknow) లో ఈ ఎంబీఏ డిజిటల్ బిజినెస్ (MBA (Digital Business) కోర్సులో ప్రవేశం పొందాలంటే విద్యార్థులు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2023 (Common University Entrance Test CUET PG 2023) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ ప్రవేశపరీక్షలో సాధించిన మార్కుల ఆధారంగానే ఐఐఐటీ లక్నో (IIIT Lucknow) ఎంబీఏ డిజిటల్ బిజినెస్ (MBA (Digital Business) కోర్సులో ప్రవేశం కల్పిస్తుంది. ఇది రెండు సంవత్సరాల ఫుల్ టైమ్ కోర్సు. ఇందులో డిజిటల్ మార్కెటింగ్ (Digital Marketing), ఫిన్ టెక్ (FinTech), బిజినెస్ అనలటిక్స్ (Business Analytics), ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ (Artificial Intelligence), క్లౌడ్ కంప్యూటింగ్ (Cloud Computing), బ్లాక్ చెయిన్ (Blockchain) తదితర అడ్వాన్స్డ్ టెక్నాలజీలపై అవగాహన కల్పిస్తారు.

MBA (Digital Business) in IIIT Lucknow: అర్హత, ఇతర వివరాలు..

ఈ MBA (Digital Business) కోర్సులో చేరడానికి ఇంజినీరింగ్ (Engineering), సైన్స్ (Science), కామర్స్ (Commerce), హ్యుమానిటీస్ (Humanities).. ఇలా ఏ డిసిప్లిన్ నుంచి అయినా, కనీసం 50% మార్కులతో డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. అయితే, వారు కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ పీజీ 2023 (Common University Entrance Test CUET PG 2023) లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఈ MBA (Digital Business) కోర్సులో క్లాస్ రూమ్ లెక్చర్స్, కేస్ స్టడీస్, ప్రాజెక్ట్స్ మొదలైనవి ఉంటాయి. ఇండస్ట్రీ నిపుణుల నుంచి ప్రత్యేక తరగతులను నిర్వహిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసినవారు ఈ కామర్స్ (e-commerce), డిజిటల్ మార్కెటింగ్ (digital marketing), టెక్నాలజీ మేనేజ్మెంట్ (technology management), కన్సల్టింగ్ (consulting) తదితర రంగాల్లో కెరియర్ ను రూపొందించుకోవచ్చు.

తదుపరి వ్యాసం