తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Island For Sale: ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి.. హైదరాబాద్‍లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే..

Island for Sale: ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి.. హైదరాబాద్‍లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే..

18 January 2023, 7:07 IST

google News
    • Iguana Island for Sale: ఓ ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి వచ్చింది. చెట్లు, విలాసవంతమైన ఇంటితో కూడిన ఈ ద్వీపం మొత్తం ప్రస్తుతం వేలానికి అందుబాటులో ఉంది. హైదరాబాద్‍లో ఓ రిచ్ ఏరియాలో అపార్ట్‌మెంట్ కొనే ధరకే ఈ ఐల్యాండ్‍ ఉంది.
Island for Sale: ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి.. హైదరాబాద్‍లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే.. (Photo: Private Island)
Island for Sale: ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి.. హైదరాబాద్‍లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే.. (Photo: Private Island)

Island for Sale: ఐల్యాండ్ మొత్తం అమ్మకానికి.. హైదరాబాద్‍లో అపార్ట్‌మెంట్ కొనే ధరకే.. (Photo: Private Island)

Iguana Island for Sale: హైదరాబాద్‍ నగరం నడిబొడ్డున అపార్ట్‌మెంట్ కొనే ధరకు.. ఏకంగా ఓ ఐల్యాండ్ మొత్తాన్ని దక్కించుకునే అవకాశం వచ్చింది. ఆన్‍లైన్ వేలంలో ప్రస్తుతం ఈ సెంట్రల్ అమెరికన్ ఐల్యాండ్ ఉంది. దీని వేలం ఇంకా కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్ కొనాలంటే రూ.కోట్లు వెచ్చించాల్సిన పరిస్థితి. భాగ్యనగరంలో ఇళ్లకు అంత డిమాండ్ ఉంది. ఓ విలాసవంతమైన అపార్ట్‌మెంట్ కొనుగోలు చేయాలంటే రూ.4కోట్లు అయినా ఖర్చవుతుంది. అయితే ఇదే ధరకు ఏకంగా ఆ ఐల్యాండ్‍నే దక్కించుకోవచ్చు. పూర్తి వివరాలివే..

ఐల్యాండ్ ఎక్కడ ఉందంటే..

Iguana Island: ప్రస్తుతం ఇగువనా ఐల్యాండ్ అమ్మకానికి అందుబాటులో ఉంది. అమెరికాలోని నికరాగువా పరిధిలోని బ్లూఫీల్డ్ తీరానికి 19.5 కిలోమీటర్ల దూరంలో ఈ ఐల్యాండ్ (Iguana Island) ఉంది. మొత్తంగా ఈ ఐల్యాండ్ ఐదు ఎకరాల్లో ఉంది. అరటి, కొబ్బరి చెట్లతో నిండి ఉంది. ప్రస్తుతం ప్రైవేట్ ఐల్యాండ్స్ ఐఎన్‍సీ (Private Islands Inc) రియల్ ఎస్టేట్ వెబ్‍సైట్‍లో ఈ ఐల్యాండ్ వేలం జరుగుతోంది.

Iguana Island for Sale: “మూడు బెడ్‍రూమ్‍లు, రెండు బాత్‍రూమ్‍లు ఉన్న ఇంటిని ఇగువనా ఐల్యాండ్ కలిగి ఉంది. ఈ ఇంట్లో డైనింగ్ రూమ్, లివింగ్ ఏరియా, స్విమ్మింగ్ పూల్ సదుపాయాలు కూడా ఉన్నాయి. అమెరికన్ డెవలపర్లతో అధునాతన సదుపాయాలతో ఈ ఇళ్లు నిర్మితమైంది” అని ప్రైవేట్ ఐల్యాండ్స్ వెబ్‍సైట్ పేర్కొంది.

ధర ఇదే..

Iguana Island for Sale: ప్రైవేట్ ఐల్యాండ్స్ వెబ్‍సైట్‍లో ఇప్పటికీ ఈ ఇగువనా ఐల్యాండ్ అందుబాటులో ఉంది. వేలం జరుగుతోంది. ఈ ఐల్యాండ్ ధర 4,75,000 డాలర్లుగా ఉంది. అంటే సుమారు రూ.3.87 కోట్లు. కావాలనుకునే వారు ఆన్‍లైన్ వేలంలో పాల్గొనవచ్చు. ఇక ఈ ఐల్యాండ్‍కు వైఫై, మొబైల్, టీవీ సిగ్నల్స్ కూడా వస్తాయని ప్రైవేట్ ఐల్యాండ్స్ సంస్థ పేర్కొంది.

ఈ ఐల్యాండ్‍లో పని చేసేందుకు ఆన్‍సైట్ మేనేజర్లు, కేర్ టేకర్లు కూడా ఆసక్తిగా ఉన్నారని వెల్లడించింది. తమ కుటుంబ సభ్యులు మృతి చెందటంతో ప్రస్తుత యజమాని ఈ ఐల్యాండ్ ధరను తగ్గించి, వేలానికి తెచ్చారని ప్రైవేట్ ఐల్యాండ్స్ వెబ్‍సైట్ పేర్కొంది.

తదుపరి వ్యాసం