తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Ignou January 2023 Session: ఇగ్నో రీ రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ ఇదే..

IGNOU January 2023 Session: ఇగ్నో రీ రిజిస్ట్రేషన్ కు లాస్ట్ డేట్ ఇదే..

HT Telugu Desk HT Telugu

14 December 2022, 20:32 IST

google News
  • IGNOU January 2023 Session: 2023 జనవరి సెషన్ కు రీరిజిస్ట్రేషన్ చేసుకోవడానికి తేదీలను ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(IGNOU) ప్రకటించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

IGNOU January 2023 Session: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ(Indira Gandhi National Open University - IGNOU)లో జనవరి 2023 సెషన్ కి డిగ్రీ, పీజీ చేయాలనుకునే వారు తమ రీ రిజిస్ట్రేషన్ ను ఈ సంవత్సరం డిసెంబర్ 31 లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇగ్నో(IGNOU) అధికారిక వెబ్ సైట్ ignou.ac.in ద్వారా మాత్రమే ఈ రిజిస్ట్రేషన్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. వివిధ మాస్టర్స్, బ్యాచులర్ డిగ్రీ కోర్సులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వారు ముందుగా IGNOU వెబ్ సైట్ ignou.ac.in కి వెళ్లి వివరాలు తెలుసుకోండి. డిగ్రీ స్థాయిలో జనరల్, హానర్స్ కోర్సులకు కూడా రీ రిజిస్ట్రేషన్ తప్పని సరి.

IGNOU reregistration process: రీరిజిస్ట్రేషన్ ఎలా?

  • ముందుగా ఇగ్నో(ignou) అధికారిక వెబ్ సైట్ ignou.ac.in ను ఓపెన్ చేయాలి.
  • హోం పేజీలో కనిపిస్తున్న IGNOU January 2023 Session లింక్ పై క్లిక్ చేయాలి.
  • లాగిన్ వివరాలు ఎంటర్ చేసి, సబ్మిట్ నొక్కాలి.
  • మీ కోర్సు ను ఎంపిక చేసుకుని, ఆన్ లైన్ లోనే దరఖాస్తు పత్రాన్ని నింపాలి.
  • అప్లికేషన్ ఫీజు ను చెల్లించే ఆప్షన్ కూడా వెబ్ సైట్ లోనే అందుబాటులో ఉంటుంది. అందులో అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
  • దాంతో రీ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ముగుస్తుంది. దరఖాస్తు ఫామ్ ను డౌన్ లోడ్ చేసుకుని, ప్రింట్ తీసుకుని, ఒక హార్డ్ కాపీని భవిష్యత్ అవసరాల కోసం భద్రపర్చుకోండి.

టాపిక్

తదుపరి వ్యాసం