IGNOU B.Ed Entrance Results: ఇగ్నో బీఈడీ ఎంట్రెన్స్ రిజల్ట్స్ వెల్లడి
08 January 2024, 19:23 IST
IGNOU B.Ed Entrance Results: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (IGNOU) నిర్వహించిన బీఈడీ (B.Ed) ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి.
ప్రతీకాత్మక చిత్రం
IGNOU B.Ed Entrance Results: ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ (Indira Gandhi National Open University IGNOU) నిర్వహించిన బీఈడీ (B.Ed) ప్రవేశ పరీక్ష ఫలితాలు వెలువడ్డాయి. ఈ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఇగ్నో (IGNOU) అధికారిక వెబ్ సైట్ ignou.ac.in. లో ఫలితాలను చెక్ చేసుకోవచ్చు.
IGNOU B.Ed Entrance Results: ఇగ్నో బీఈడీ
దూర విద్య విధానంలో బ్యాచ్ లర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed) డిగ్రీని ఆఫర్ చేస్తున్న ఓపెన్ యూనివర్సిటీల్లో ఇగ్నో (IGNOU) ప్రముఖమైనది. ఇగ్నోలో బీఈడీ (B.Ed) చేయడానికి ఆ వర్సిటీ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది. 2023 సంవత్సరానికి గానూ ఈ బీఈడీ ప్రవేశపరీక్షను ఇగ్నో (IGNOU) ఈ సంవత్సరం జనవరి 8వ తేదీన నిర్వహించింది. ఆ ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితాలను గురువారం విడుదల చేసింది. అయితే, ఈ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించినంత మాత్రాన అడ్మిషన్ సాధించినట్లు కాదని ఇగ్నో (IGNOU) వెల్లడించింది. ఇగ్నో రీజనల్ సెంటర్లలో జరిగే కౌన్సెలింగ్ లో ఇతర అన్ని అర్హతలను పరిశీలించి బీఈడీ (B.Ed) కోర్సులో అడ్మిషన్ ను ఖరారు చేస్తామని స్పష్టం చేసింది.
IGNOU B.Ed Entrance Results: రిజల్ట్ ను ఇలా చెక్ చేసుకోండి..
- ఇగ్నో (IGNOU) బీఈడీ (B.Ed) ఎంట్రన్స్ టెస్ట్ రిజల్ట్ ను చెక్ చేసుకోవడానికి ముందుగా ఇగ్నో అధికారిక వెబ్ సైట్ ignou.ac.in. ను ఓపెన్ చేయాలి.
- హోం పేజీలో కనిపించే IGNOU B.Ed Entrance Result 2023 లింక్ పై క్లిక్ చేయాలి.
- ఎన్ రోల్ మెంట్ నెంబర్ ను ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ నొక్కాలి.
- మీ బీఈడీ (B.Ed) ఎంట్రెన్స్ టెస్ట్ ఫలితం స్క్రీన్ పై డిస్ ప్లే అవుతుంది.
- రిజల్ట్ ను చెక్ చేసుకుని ఆ పేజీని డౌన్ లోడ్ చేసుకుని భద్రపర్చుకోవాలి.
- భవిష్యత్ అవసరాల కోసం రిజల్ట్ ను ప్రింట్ తీసుకుని భద్రపర్చుకోవాలి.
టాపిక్