తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Kejriwal Appeal: కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు; కేజ్రీవాల్ హిందూత్వ డిమాండ్

Kejriwal appeal: కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు; కేజ్రీవాల్ హిందూత్వ డిమాండ్

HT Telugu Desk HT Telugu

26 October 2022, 16:14 IST

google News
  • Kejriwal appeals to centre: ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వం ముందు వినూత్న డిమాండ్ ను ఉంచారు. 

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్

Kejriwal appeals to centre: భారతీయ కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను ముద్రించాలని ఢిల్లీ సీఎం, ఆప్ నేత అరవింద్ కేజ్రీవాల్ మగళవారం డిమాండ్ చేశారు.

Kejriwal appeals to centre: గుజరాత్ ఎన్నికలు..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బీజేపీ తో తలపడుతోంది. పలువురు ఆప్ నేతలు ఇటీవల చేసిన కామెంట్లు, హాజరైన కార్యక్రమాలను చూపుతూ ఆప్ హిందుత్వ వ్యతిరేకి అన్న ముద్రను బీజేపీ బలంగా వేయగలిగింది. ఈ నేపథ్యంలో ఆ ముద్రను తొలగించే దిశగా కేజ్రీవాల్ చర్యలు ప్రారంభించారు. అందులో భాగంగానే ఈ కరెన్సీ నోట్లపై హిందూ దేవుళ్ల బొమ్మలను చిత్రించాలన్న డిమాండ్ అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Kejriwal appeals to centre: ఇండోనేషియాలోనూ..

ముస్లిం దేశమైన ఇండోనేషియా కరెన్సీ నోటుపై వినాయకుడి బొమ్మ ఉంటుందని, అలాంటిది భారత్ లో కోట్లాది హిందువులు సంపదనిచ్చే దేవిగా ఆరాధించే లక్ష్మీదేవి చిత్రాన్ని, విఘ్నాలను తొలగించే వినాయకుడి బొమ్మను ఇండియన్ కరెన్సీ నోట్లపై ఎందుకు చిత్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.

Kejriwal appeals to centre: గాంధీ బొమ్మతో పాటు..

దీపావళి సందర్భంగా పూజలు చేసే సమయంతో తనకు ఈ భావన బలంగా కలిగిందని కేజ్రీవాల్ వివరించారు. లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రించడం వల్ల భారతీయ ఎకానమీ మరింత వృద్ధి చెందుతుందన్నారు. కేవలం దేవుళ్ల చిత్రాలను ముద్రిస్తే.. ఎకానమీ మెరుగవుతుందని నేను అనడం లేదు. కానీ వారి దీవెనలతో ఆర్థిక వ్యవస్థ అభివృద్ధికి చేపట్టే చర్యలు ఫలవంతమవుతాయి’ అని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం కరెన్సీలపై ఉన్న మహాత్మా గాంధీ బొమ్మతో పాటు లక్ష్మీదేవి, వినాయకుడి చిత్రాలను కూడా ముద్రించాలని ఆయన కోరారు. ఈ విషయంపై ప్రధాని మోదీకి త్వరలో లేఖ రాస్తానన్నారు.

తదుపరి వ్యాసం