IBPS RRB Recruitment 2023: ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ, క్లర్క్ పోస్ట్ లకు అప్లై చేయండి; ఈ రోజే లాస్ట్ డేట్..
07 August 2023, 14:27 IST
- IBPS RRB Recruitment 2023: రీజనల్ రూరల్ బ్యాంక్ ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి జూన్ 28 ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేయడం ఉత్తమం.
ప్రతీకాత్మక చిత్రం
IBPS RRB Recruitment 2023: ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి జూన్ 28 ఆఖరు తేదీ. ఇప్పటివరకు అప్లై చేయని అర్హులైన అభ్యర్థులు వెంటనే అప్లై చేయడం ఉత్తమం.
మొత్తం 8 వేల పోస్ట్ లు
దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ ల భర్తీ ప్రక్రియను ఐబీపీఎస్ (Institute of Banking Personnel Selection IBPS) నిర్వహిస్తోంది. తాజాగా, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో (RRB) ల్లో పీఓ, క్లర్క్ పోస్ట్ ల భర్తీ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 28. ఆన్ లైన్ లో ibps.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 8000 గ్రూప్ ఏ, గ్రూప్ బీ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు.గ్రూప్ ఏలో స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉంటారు. గ్రూప్ బీలో క్లర్క్స్, మల్టీ పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు. ఈ పోస్ట్ లకు తగిన విద్యార్హతలు ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో ibps.in వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ ఫీ చెల్లింపునకు కూడా జూన్ 28వ తేదీనే లాస్ట్ డేట్.
ఇతర వివరాలు..
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ప్రి ఎగ్జామ్ ట్రైనింగ్ (Pre-Exam training) ను ఐబీపీఎస్ జులై 17 నుంచి జులై 22 వరకు నిర్వహిస్తుంది. ఆ తరువాత, ప్రిలిమ్స్ పరీక్ష ఆగస్ట్ నెలలో ఉంటుంది. సెప్టెంబర్ నెలలో మెయన్స్ పరీక్ష ఉంటుంది. అక్టోబర్ లేదా నవంబర్ నెలలో ఇంటర్వ్యూలు ఉంటాయి. ఆ తరువాత రెండు వారాల్లోపు ఫైనల్ రిజల్ట్ ను ప్రకటిస్తారు. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు రూ. 175 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ కేటగిరీల వారు), రూ. 850 (ఇతరులు) పరీక్ష ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది.