తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Iaf Agniveervayu Recruitment : వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం.. అప్లికేషన్​కు నేడే లాస్ట్​ డేట్​!

IAF Agniveervayu recruitment : వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం.. అప్లికేషన్​కు నేడే లాస్ట్​ డేట్​!

Sharath Chitturi HT Telugu

11 February 2024, 11:41 IST

  • IAF Agniveervayu recruitment 2024 : ఐఏఎఫ్​ అగ్నివీర్వాయు రిక్రూట్​మెంట్​కు సంబంధించి కీలక అప్డేట్​. నేటితో.. రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తికానుంది. ఇంకా అప్లై చేసుకోని వారు వెంటనే త్వరపడండి..

వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం.. అప్లికేషన్​కు నేడే లాస్ట్​ డేట్​!
వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం.. అప్లికేషన్​కు నేడే లాస్ట్​ డేట్​! (X/@IAF_MCC)

వైమానిక దళంలో అగ్నివీరుల నియామకం.. అప్లికేషన్​కు నేడే లాస్ట్​ డేట్​!

IAF Agniveervayu recruitment 2024 apply online : అగ్నివీర్వాయుల రిక్రూట్మెంట్ కోసం ఇండియన్​ ఎయిర్​ఫోర్స్​ నోటిఫికేషన్​ని విడుదల చేసిన విషయం తెలిసింది. ఇక ఇప్పుడే.. నేటితో అప్లికేషన్​ ప్రక్రియ ముగియనుంది. రాత్రి 11 గంటలకు.. రిజిస్ట్రేషన్​ విండో మూతపడిపోతుంది. ఇంకా దరఖాస్తు చేసుకోని వారు, ఆసక్తిగల అభ్యర్థులు agnipathvayu.cdac.in అధికారిక వెబ్​సైట్​ ద్వారా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్​ ఫామ్​ని సమర్పించేందుకు.. డైరక్ట్​ లింక్​ కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ట్రెండింగ్ వార్తలు

Rishi Sunak net worth : కింగ్​ చార్లెస్​ కన్నా.. రిషి సునక్​- అక్షతా మూర్తులే ధనవంతులు!

Naturals Ice Cream : నేచురల్స్​ ఐస్​క్రీమ్​ వ్యవస్థాపకుడు రఘునందన్​ కామత్​ కన్నుమూత..

Thief Lawyer: కి‘‘లేడీ లాయర్’’.. కోర్టులోనే దర్జాగా దొంగతనాలు; ఎట్టకేలకు అరెస్ట్

COVID-19: మళ్లీ కోవిడ్-19 కలకలం; సింగపూర్ లో వారం రోజుల్లో 25,900 కేసులు నమోదు

వాస్తవానికి.. అప్లికేషన్​ ప్రక్రియ ఈ నెల 6తోనే ముగియాల్సి ఉంది. కానీ దానిని 11 వరకు పొడిగించారు. ఇక ఆన్​లైన్​ పరీక్ష.. మార్చ్​ 17న ప్రారంభమవుతుంది.

ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్ 2024

వయోపరిమితి:

  • అభ్యర్థుల గరిష్ట వయస్సు 21 సంవత్సరాలు దాటకూడదు.
  • IAF Agniveervayu recruitment : 2 జనవరి 2004 నుంచి 02 జూలై 2007 మధ్య జన్మించిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

విద్యార్హత:

సైన్స్ సబ్జెట్స్​..

  • అభ్యర్థులు ఇంటర్మీడియట్/ 10+2/ తత్సమాన పరీక్షలో మ్యాథ్స్, ఫిజిక్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులతో ఉత్తీర్ణులై ఉండాలి.
  • కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల గుర్తింపు పొందిన బోర్డులు నుంచి కనీసం 50 శాతం మార్కులతో, ఇంగ్లిష్​లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.

లేదా

  • డిప్లొమా కోర్సులో ఇంగ్లిష్ లో 50 శాతం మార్కులతో కేంద్ర, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రాంతాల గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ సంస్థల నుంచి ఇంజినీరింగ్ (మెకానికల్ / ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ / ఆటోమొబైల్ / కంప్యూటర్ సైన్స్ / ఇన్ స్ట్రుమెంటేషన్ టెక్నాలజీ / ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) లో మూడేళ్ల డిప్లొమా కోర్సులను ఉత్తీర్ణులై ఉండాలి.

ఐఏఎఫ్ అగ్నివీర్వాయు రిక్రూట్మెంట్- ఇలా అప్లై చేసుకోండి..

IAF Agniveervayu recruitment 2024 syllabus : స్టెప్​ 1:- ఐఏఎఫ్​ అగ్నివీర్​ అధికారిక వెబ్​సైట్​లోకి వెళ్లండి.

స్టెప్​ 2:- హోం పేజ్​లో కనిపించ రిజిస్ట్రేషన్​ లింక్​పై క్లిక్​ చేయండి.

స్టెప్​ 3:- కొత్త పేజ్​ ఓపెన్​ అవుతుంది. అందులో పలు వివరాలు ఇచ్చి, రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి.

స్టెప్​ 4:- అప్లికేషన్​ ఫామ్​ని ఫిల్​ చేసి, పేమెంట్​ చేయాలి.

స్టెప్​ 5:- సబ్మీట్​ బటన్​ ప్రెస్​ చేసి, సంబంధిత పేజ్​ని డౌన్​లోడ్​ చేసుకోవాలి.

IAF Agniveervayu recruitment : స్టెప్​ 6:- భవిష్యత్​ అవసరాల కోసం ఆ పేజ్​ని ప్రింటౌంట్​ తీసుకోవాలి.

తదుపరి వ్యాసం