తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Pf Balance Check: ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు!

PF Balance Check: ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు!

31 January 2023, 9:28 IST

google News
    • PF Account Balance check: పీఎఫ్ అకౌంట్‍లో బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు వివిధ మార్గాలు ఉన్నాయి. అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవచ్చు. ఎలాగంటే..
PF Balance Check: ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు! (ప్రతీకాత్మక చిత్రం)
PF Balance Check: ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు! (ప్రతీకాత్మక చిత్రం) (HT_Photo)

PF Balance Check: ఇంటర్నెట్ లేకున్నా పీఎఫ్ బ్యాలెన్స్ ఇలా చెక్ చేసుకోవచ్చు! (ప్రతీకాత్మక చిత్రం)

PF Account Balance check: తమ ప్రావిడెంట్ ఫండ్‍ (Provident Fund - PF) ఖాతాలో ఎంత మొత్తం ఉందనే విషయం ఉద్యోగులు సులభంగా స్వయంగా తెలుసుకోవచ్చు. ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మొబైల్‍లో కూడా బ్యాలెన్స్ తనిఖీ చేసుకోవచ్చు. ఇందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఈపీఎఫ్‍వో అధికారిక వెబ్‍సైట్ ద్వారా తమ పీఎఫ్ ఖాతాలో ఎంత జమ అయిందో వివరాలు చూడవచ్చు. అయితే ఇంటర్నెట్ లేకుండా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునే సదుపాయాన్ని ఈపీఎఫ్‍వో (EPFO) అందుబాటులో ఉంచింది. దీని ద్వారా ఇంటర్నెట్ లేని సమయాల్లో కూడా చందాదారులు ఈపీఎఫ్ మొత్తాన్ని తెలుసుకోవచ్చు. అదెలానో ఇక్కడ చూడండి.

మిస్డ్ కాల్‍తో..

PF Balance Missed call Number: పీఎఫ్ చందాదారులు (ఉద్యోగులు) మీ మొబైల్ నుంచి 9966044425 నంబర్‌కు మిస్డ్ కాల్ ఇస్తే సరి. మీ ఫోన్‍కు మీ పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి. అయితే పీఎఫ్ అకౌంట్‍కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్ నుంచే మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఇది తప్పనిసరి. ఇలా రిజిస్టర్ అయి ఉన్న నంబర్ నుంచి 9966044425కు మిస్డ్ కాల్ ఇచ్చిన నిమిషాల్లోనే పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మీకు మెసేజ్ రూపంలో వస్తాయి.

గతంలో ఈ మిస్డ్ కాల్ సదుపాయం 011-22901406 నంబర్‌పై ఉండేది. దీన్ని మార్చింది ఈపీఎఫ్‍వో.

మెసేజ్ ద్వారా..

పీఎఫ్ ఖాతాకు రిజిస్టర్ అయిన మీ మొబైల్ నంబర్ నుంచి మెసేజ్ పంపడం ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ముందుగా మీ ఫోన్‍లో EPFOHO అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ UAN నంబర్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీకు ఏ భాషలో బ్యాలెన్స్ వివరాలు కావాలో టైప్ చేయాలి. తెలుగు అయితే TEL అని టైప్ చేయాలి (EPFOHO UAN TEL).

ఉదాహరణకు మీ యూఏఎన్ నంబర్ 1234567810 అయితే, తెలుగులో మెసేజ్ పొందాలనుకుంటే.. EPFOHO 1234567810 TEL అని టైప్ చేసి 7738299899 నంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. అంతే మీ ఫోన్‍కు పీఎఫ్ ఖాతా బ్యాలెన్స్ వివరాలు వస్తాయి.

ఇంటర్నెట్ ఉంటే, మీరు ఈపీఎఫ్‍ఓ అధికార వెబ్‍సైట్ ద్వారా కూడా పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. వెబ్‍సైట్‍లో పాస్‍బుక్ సెక్షన్‍లోకి వెళ్లి లాగిన్ అయి.. పీఎఫ్ మొత్తం ఎంత ఉందో చూడవచ్చు. ఉమాంగ్ (Umang) యాప్‍లో కూడా పీఎఫ్ వివరాలు తెలుసుకోవచ్చు.

టాపిక్

తదుపరి వ్యాసం