తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  How To Update Aadhaar : పెళ్లి తర్వాత.. ఆధార్​లో మహిళ ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి?

How to update Aadhaar : పెళ్లి తర్వాత.. ఆధార్​లో మహిళ ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి?

Sharath Chitturi HT Telugu

05 January 2024, 12:05 IST

    • How to update Aadhaar : మీకు కొత్తగా పెళ్లైందా? ఆధార్​ కార్డులో ఇంటి పేరును ఎలా మార్చుకోవాలి? అని చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే..
పెళ్లి తర్వాత.. ఆధార్​లో మహిళ ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి?
పెళ్లి తర్వాత.. ఆధార్​లో మహిళ ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి?

పెళ్లి తర్వాత.. ఆధార్​లో మహిళ ఇంటి పేరు ఎలా మార్చుకోవాలి?

How to update Aadhaar : దేశంలో 'ఆధార్​' కార్డు లేకుండా ఇప్పుడు ఏ పని జరగడం లేదు. గ్యాస్​ కనెక్షన్​ నుంచి రైల్వే టికెట్​ బుకింగ్స్​ వరకు.. ప్రతి విషయంలోనూ ఆధార్​ తప్పనిసరిగా మారింది. ఇంతటి విలువైన ఆధార్​ కార్డులో తప్పులు ఉంటే, వెంటనే మార్చుకోవాల్సి ఉంటుంది. అయితే.. కొత్తగా పెళ్లైన మహిళలకు కొన్ని సందేహాలు వస్తుంటాయి. ఆధార్​ కార్డులో ఇంటి పేరు మార్చుకోవాలా? మార్చుకోవాలి అని అనుకుంటే ఏం చేయాలి? అని ప్రశ్నలు ఉత్పన్నమవుతుంటాయి. పెళ్లి తర్వాత.. మహిళలు తమ ఆధార్​ కార్డులో ఇంటి పేరును మార్చుకోవడం ఉత్తమం. ఈ నేపథ్యంలో.. ఆధార్​ కార్డును ఎలా మార్చుకోవాలి? అన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాము.

ట్రెండింగ్ వార్తలు

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

USA Crime News: స్కూల్లో క్లాస్ మేట్స్ ఎగతాళి చేస్తున్నారని పదేళ్ల బాలుడు ఆత్మహత్య

ఆధార్​ కార్డులో మహిళలు, తమ ఇంటి పేరును మార్చుకునే ముందు.. మ్యారేజ్​ సర్టిఫికేట్​ కచ్చితంగా ఉండాలి. ఇది వెరిఫికేషన్​ డాక్యుమెంట్​గా ఉపయోగపడుతుంది.

ఇదీ చూడండి:- Lock your Aadhaar biometrics: మీ ఆధార్ బయో మెట్రిక్స్ ను ఇలా లాక్ చేసుకోండి; డేటా లీక్ సమస్య నుంచి రక్షణ పొందండి..

ఆధారంలో ఇంటి పేరు మార్చుకోండి ఇలా..

How to change surname in Aadhaar : స్టెప్​ 1:- మహిళలు, తమ భర్తలతో కలిసి ఆధార్​ సేవా కేంద్రానికి వెళ్లాల్సి ఉంటుంది.

స్టెప్​ 2:- ఆధార్​ సేవా కేంద్రంలో కరెక్షన్​ ఫామ్​ లభిస్తుంది. అది తీసుకుని మీ వ్యక్తిగత వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. పూర్తి పేరు, ఆధార్​ నెంబర్​, కాంటాక్ట్​ నెంబర్​తో పాటు ఇతర వివరాలను ఫిల్​ చేయాల్సి ఉంటుంది.

స్టెప్​ 3:- భర్త ఆధార్​ కార్డు, మ్యారేజ్​ సర్టిఫికేట్​ వంటి ప్రూఫ్​లను ఫామ్​కు యటాచ్​ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలను మళ్లీ చెక్​ చేసుకుని.. ఆధార్​ కేంద్రంలో ఉన్న అధికారికి ఇవ్వాల్సి ఉంటుంది.

Married woman surname change in Aadhaar : స్టెప్​ 4:- ఆ తర్వాత మీ బయోమెట్రిక్​ డేటా, ఫొటోలు తీసుకుంటారు. ఆ తర్వాత వెరిఫికేషన్​ ప్రక్రియ ఉంటుంది. ఆ తర్వాత నామినల్​ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఫామ్​ని సబ్మీట్​ చేసిన కొన్ని రోజులకు మీకు కొత్త ఆధార్​ కార్డు వస్తుంది. అందులో మీ ఇంటి పేరు మారి ఉంటుంది. ఇతర వివరాలను కూడా ఒకసారి చెక్​ చేసుకోవడం ఉత్తమం.

ఈ విధంగా.. పెళ్లి తర్వాత, మహిళలు.. ఆధార్​ కార్డులో సులభంగా తమ ఇంటి పేరును మార్చుకోవచ్చు.

తదుపరి వ్యాసం