తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Aadhaar Update Last Date: ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువు పొడగింపు; ఎప్పటివరకు అంటే..?

Aadhaar update last date: ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకునే గడువు పొడగింపు; ఎప్పటివరకు అంటే..?

HT Telugu Desk HT Telugu

14 September 2023, 19:10 IST

  • Aadhaar update last date: ఆధార్ ను ఉచితంగా ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకునే గడువును యూఐడీఏఐ పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆధార్ లో అడ్రస్ తదితర మార్పుచేర్పులను ఆన్ లైన్ లో ఉచితంగా చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Aadhaar update last date: ఆధార్ ఇప్పుడు అత్యంత అవసరమైన డాక్యుమెంట్. ఆ పత్రాన్ని ఎప్పటికప్పుడు అప్ డేట్ చేసుకోవడం అవసరం. ఆధార్ ను ఆన్ లైన్ లో ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 14 వరకు మాత్రమే ఉండగా, తాజాగా ఆ గడువును యూఐడీఏఐ (Unique Identification Authority of India UIDAI)పెంచింది.

ట్రెండింగ్ వార్తలు

Bihar crime news : కస్టడీలో దంపతులు మృతి.. ప్రజల ఆగ్రహానికి తగలబడిన పోలీస్​ స్టేషన్​!

Haryana bus accident : బస్సులో చెలరేగిన మంటలు.. 8 మంది మృతి- 24 మందికి గాయాలు!

Fire in flight: ఆకాశంలో ఉండగానే ఎయిర్ ఇండియా విమానంలో మంటలు; ఢిల్లీ ఏర్ పోర్ట్ లో ఫుల్ ఎమర్జెన్సీ

UGC NET June 2024: యూజీసీ నెట్ జూన్ 2024 రిజిస్ట్రేషన్ గడువును మళ్లీ పొడిగించిన ఎన్టీఏ

మరో మూడు నెలలు..

ఆధార్ లో అవసరమైన మార్పులను మరో మూడు నెలల పాటు ఎలాంటి రుసుములు చెల్లించకుండానే ఆన్ లైన్ లో అప్ డేట్ చేసుకోవచ్చు. ఈ అవకాశం సెప్టెంబర్ 14 వరకు మాత్రమే ఉండగా, తాజాగా ఆ గడువును యూఐడీఏఐ (Unique Identification Authority of India UIDAI) మరో మూడు నెలలు, అంటే డిసెంబర్ 14 వరకు పెంచింది. పౌరులు తమ ఆధార్ లో తాజా సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవడాన్ని ప్రోత్సహించడం కోసం ఈ గడువు పొడగింపు నిర్ణయం తీసుకున్నామని యూఐడీఏఐ తెలిపింది. ఈ మేరకు ప్రజల నుంచి పలు అభ్యర్థనలు కూడా వచ్చాయని వెల్లడించింది. మై ఆధార్ పోర్టల్ (myAadhaar portal) ద్వారా పౌరులు తమ ఆధార్ ను ఉచితంగా అప్ డేట్ చేసుకోవచ్చని తెలిపింది.

10 ఏళ్లు దాటితే..

ఆధార్ లో చిరునామా వంటి మార్పు చేర్పులే కాకుండా, ఒకవేళ ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటి ఉంటే కూడా ప్రజలు తమ ఆధార్ ను అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. చిరునామా తదితర లేటెస్ట్ సమాచారాన్ని తమ ఆధార్ లో పొందుపర్చాలని యూఐడీఏఐ కోరింది. లేటెస్ట్ గుర్తింపు పత్రాలను, చిరునామా గుర్తింపు పత్రాలను వెబ్ సైట్ లో అప్ లోడ్ చేయాలని కోరింది. పేరు, చిరునామా, వివాహం వల్ల జరిగే మార్పు, చేర్పులు, మరణిస్తే ఆ వివరాలు.. మొదలైన వాటిని ఆధార్ లో అప్ డేట్ చేయాలని సూచించింది. ఆన్ లైన్ లో కాకుండానే, మీ సేవ కేంద్రాల ద్వారా రూ. 25 చెల్లించి ఆధార్ అప్ డేట్ చేసుకోవచ్చు.

ఇలా అప్ డేట్ చేసుకోండి..

  • ముందుగా https://myaadhaar.uidai.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయండి.
  • మీ వివరాలతో లాగిన్ కావాలి.
  • Name/Gender/Date of Birth & Address Update ను సెలెక్ట్ చేసుకోవాలి.
  • “Update Aadhaar Online” లింక్ పై క్లిక్ చేయాలి.
  • మీరు చిరునామా మార్చాలనుకుంటే address ను సెలెక్ట్ చేసుకుని Proceed to Update Aadhaar పై క్లిక్ చేయాలి.
  • అడ్రస్ ను నిర్ధారించే డాక్యుమెంట్ స్కాన్డ్ కాపీని అప్ లోడ్ చేయాలి.
  • సబ్మిట్ చేయాలి. సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ వస్తుంది. దాన్ని భద్రపర్చుకోవాలి.

తదుపరి వ్యాసం