Ration Card | ఇంట్లో కూర్చొనే రేషన్ కార్డు అప్లై చేసుకోవచ్చు.. ఇలా చేసేయండి..
05 April 2022, 11:12 IST
- రేషన్ కార్డు తీసుకొనేందుకు.. ఎక్కువ తిరగాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొనే అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర కొన్ని సర్టిఫికేట్స్ ఉంటే చాలు. ఎంచక్కా.. కూర్చున్న చోటు నుంచి పని పూర్తవుతుంది.
ప్రతీకాత్మక చిత్రం
దేశంలో రేషన్ కార్డు తప్పనిసరి. దీనితో ప్రజలు చౌకగా రేషన్ సరకులు పొందుతారు. ఇదో గుర్తింపు కార్డు కూడా. ఈ పథకంలో ఎవరైనా ఎక్కడైనా.. రేషన్ తీసుకొవచ్చు. పేదలకు ఇది ఎంతో మేలు. తక్కువ ధరకే రేషన్ దుకాణాల్లో ఇచ్చే.. సరకులతో ఇల్లు గడుస్తుంది. అయితే ఇంకా కొంతమంది రేషన్ కార్డు అప్లై చేసుకోని వారు కూడా ఉన్నారు. అలాంటి వారకి ఎలాంటి భయం లేదు. మీరు వెళ్లి.. రేషన్ కార్డు అప్లై కోసం పెద్దగా తిరగాల్సిన పని లేదు. ఇంట్లో కూర్చొనే స్మార్ట్‌ఫోన్ నుంచి ఆన్‌లైన్ లో రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
రేషన్ కార్డు ఉంటే.. పథకం ద్వారా ఆహార ధాన్యాల బియ్యం, గోధుమలు, చక్కెర.. లాంటివి తక్కువ ధరలకే పొందొచ్చు. ఇవన్నీ.. ప్రయోజనాలను పొందాలంటే.. మీరు చేయాల్సిందల్లా మీ పేరు రేషన్ కార్డు తీసుకోవడం. అయితే.. ప్రభుత్వ కార్యాలయాల ద్వారా దీన్ని తీసుకోవడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి మీరు ఇంట్లో నుంచే.. ఎంచక్కా అప్లై చేసుకోవచ్చు. దీనికోసం కొన్ని పత్రాలు అవసరం. అధికారిక వెబ్‌సైట్ లోకి వెళ్లి అప్లై చేసుకుంటే సరిపోతుంది.
అవసరమైన పత్రాలు
కుటుంబ సభ్యుల పాస్‌పోర్ట్ సైజు ఫోటో
ఆధార్ కార్డ్
విద్యుత్ బిల్లు
ఆదాయ ధృవీకరణ పత్రం
మీ పాస్‌బుక్ మొదటి పేజీ కాపీ
గ్యాస్ కనెక్షన్ వివరాలు
ఇందుకోసం అన్ని రాష్ట్రాలు వారి రాష్ట్రానికి సంబందించి.. ఒక వెబ్‌సైట్‌ను రూపొందించాయి. మీరు ఏ రాష్ట్రంలో నివసిస్తున్నారో, ఆ వెబ్‌సైట్‌కి వెళ్లి రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది. తెలంగాణలో అయితే https://epds.telangana.gov.in/FoodSecurityAct/ సైట్ కు వెళ్లి రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవాలి.
ఢిల్లీలో రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు ఢిల్లీ నివాసి అయితే
https://nfs.delhigovt.nic.in/కి వెళ్లండి.
ఆ తర్వాత దరఖాస్తు చేయడానికి పోర్టల్‌లో లాగిన్ చేయండి.
NFSA 2013 కింద ఆహార భద్రత కోసం దరఖాస్తు ఫారమ్‌పై క్లిక్ చేయండి.
దీని తర్వాత దరఖాస్తు ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని నింపాలి. పత్రాలను అప్‌లోడ్ చేయండి.
యూపీలో రేషన్ కార్డు కోసం ఆన్‌లైన్‌లో ఎలా దరఖాస్తు చేయాలి?
మీరు యూపీలో నివసిస్తుంటే, ప్రభుత్వ అధికారిక సైట్‌కి వెళ్లండి. https://fcs.up.gov.in
సైట్ హోమ్‌పేజీలో, డౌన్‌లోడ్ ఫారమ్ ఎంపికపై క్లిక్ చేయాలి.
డౌన్‌లోడ్ ఫారమ్ ఎంపికపై క్లిక్ చేసిన వెంటనే, రెండు వేర్వేరు లింక్‌లు వస్తాయి, మొదట గ్రామీణ ప్రాంతంలో నివసించే వారికి, రెండోది పట్టణ ప్రాంతంలో నివసించే వారికి.
గ్రామీణ, పట్టణాల మధ్య ఏదైనా లింక్‌పై క్లిక్ చేయవచ్చు. దాని ప్రకారం ఫారమ్ ఓపెన్ అవుతుంది. ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.
ఫారమ్ నుంచి ప్రింట్ అవుట్ తీసుకోండి, మీ అన్ని వివరాలను పూరించండి మరియు దానిని తహసీల్ సెంటర్ లేదా ప్రాంతీయ సీఎస్ సీ కేంద్రానికి సమర్పించండి.