తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  'India Should Colonise Uk': ‘‘బ్రిటన్ ను భారత్ వలస దేశంగా మార్చుకోవాలి’’

'India should colonise UK': ‘‘బ్రిటన్ ను భారత్ వలస దేశంగా మార్చుకోవాలి’’

HT Telugu Desk HT Telugu

21 October 2022, 21:44 IST

google News
  • 'India should colonise UK': బ్రిటన్ లో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో.. దక్షిణాఫ్రికా కమేడియన్ ట్రెవర్ నోవా పాత వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది.

దక్షిణాఫ్రికా కమేడియన్ ట్రెవర్ నోవా
దక్షిణాఫ్రికా కమేడియన్ ట్రెవర్ నోవా (AP)

దక్షిణాఫ్రికా కమేడియన్ ట్రెవర్ నోవా

'India should colonise UK': ట్రెవర్ నోవా దక్షిణాఫ్రికా కు చెందిన ప్రముఖ కమేడియన్. టీవీ షో హోస్ట్. ఆయన వీడియోలు క్షణాల్లో వైరల్ గా మారుతుంటాయి. తాజాగా, భారత్, బ్రిటన్ లపై ఆయన చేసిన వ్యాఖ్యలతో ఉన్న ఒక పాత వీడియో మళ్లీ తెరపైకి వచ్చి వైరల్ గా మారింది.

'India should colonise UK': వలస దేశం..

భారత్ ను బ్రిటన్ 200 ఏళ్లకు పైగా పాలించిన విషయం తెలిసిందే. వలస దేశంగా భారత్ ను దశాబ్దాల పాటు దోచుకుంది. రవి అస్తమించని సామ్రాజ్యంగా భారత్ తో పాటు అనేక దేశాలపై బ్రిటన్ ఆధిపత్యం చెలాయించింది. 1947లో స్వాతంత్య్రం పొందిన అనంతరం భారత్ అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తూ వస్తోంది.

'India should colonise UK': బ్రిటన్ సంక్షోభం

మరోవైపు, బ్రిటన్ ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఆర్థిక సంక్షోభ పర్యవసానంగా రాజకీయ సంక్షోభం తలెత్తింది. ఈ సంక్షోభాలతో గతంలో బోరిస్ జాన్సన్, తాజాగా లిజ్ ట్రస్ తమ పీఎం పదవులను పోగొట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో పలు మీమ్స్ వెల్లువెత్తాయి.అందులో భాగంగా, Trevor Noah కి చెందిన 2019 నాటి పాత వీడియో కూడా తెరపైకి వచ్చింది.

'India should colonise UK': భారత్ కు వలస దేశంగా బ్రిటన్

2019లో ఆయన తన డైలీ షో వీడియోలో కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో భారత్ బ్రిటన్ ను వలసదేశంగా మార్చుకోవాలని వ్యాఖ్యానించారు. ’బ్రెక్జిట్ తరువాత పరిస్థితులు దారుణంగా మారాయి. ముగ్గురు ప్రధానులు మారారు. ఇప్పటికైనా భారత్ లేదా ఏదైనా వేరే దేశం బ్రిటన్ ను వలసదేశంగా మార్చుకుంటే బెటర్’ అని ఆయన ఆ షోలో వ్యాఖ్యానించారు. ‘ఈ సమస్య నుంచి బయటపడడం మీకు తెలియదు. సరిగ్గా పాలించడం మీకు చేతకావడం లేదు. మాకు అప్పగించడం. సరి చేసి చూపెడ్తాం’ అని చెప్పి భారత్ బ్రిటన్ ను వలస దేశంగా మార్చుకోవాలి అని ఆయన కామెంట్ చేశారు. ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో ఈ వీడియో మరోసారి నెట్టింట్లో భారీగా షేర్ అవుతోంది.

తదుపరి వ్యాసం