తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Republic Day News | గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో భారీ భదత్రా ఏర్పాట్లు

Republic day news | గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో భారీ భదత్రా ఏర్పాట్లు

Sharath Chitturi HT Telugu

25 January 2022, 12:26 IST

google News
    • Republic Day 2022: 73వ రిపబ్లిక్​ డే నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ.. ఆంక్షల వలయంలోకి జారుకుంది. వేడుకల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు అధికారులు. 27వేల మంది పోలీసు సిబ్బంది ఇప్పటికే విధులు నిర్వహిస్తున్నారు. 500కుపైగా సీసీటీవీ కెమెరాలను రాజ్​పథ్​ మార్గంలో సిద్ధం చేశారు. కొవిడ్​ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు పాటించాల్సిన నిబంధనలను జారీచేశారు.
గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు
గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు (hindustan times)

గణతంత్ర వేడుకల కోసం ఢిల్లీలో భారీ భద్రతా ఏర్పాట్లు

Republic Day 2022 celebrations: 73వ గణతంత్ర దినోత్సవం కోసం భారత దేశం ముస్తాబవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం ఉదయం 10:20 గంటలకు గణతంత్ర పరేడ్​ ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దేశంలోని ప్రముఖులు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. కొవిడ్​ నిబంధనలకు అనుగుణంగా వేడుకలు నిర్వహించేందుకు అధికారులు ఇప్పటికే పూర్తిస్థాయి ఏర్పాట్లు చేశారు.

భద్రత కట్టుదిట్టం..

గణతంత్ర వేడుకలకు ఉగ్రముప్పు పొంచి ఉందన్న నిఘా వర్గాల సమాచారంతో అధికారులు అప్రమత్తమయ్యారు. దేశవ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. ముఖ్యంగా ఢిల్లీలో భద్రతాపరమైన ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పరేడ్​ జరగనున్న రాజ్​పథ్​ ప్రాంతంలో 27వేల మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. ఫేస్​ రికగ్నీషన్​ వ్యవస్థను ఏర్పాటు చేశారు.  ఇందుకోసం సాంకేతికతను భారీస్థాయిలో ఉపయోగించారు. 500లకుపై సీసీటీవీ కెమెరాలతో రాజ్​పథ్​ ప్రాంతంలో నిఘాపరమైన చర్యలను ముమ్మరం చేశారు. డ్రోన్లపై నిషేధం విధించారు. అనుమానాస్పద డ్రోన్లను సమర్థంగా కూల్చివేయగలిగే వ్యవస్థను రాజ్​పథ్​ మార్గంలో ఏర్పాటు చేశారు.

Republic Day Parade 2022: వీటితో పాటు ఢిల్లీలోని హోటళ్లు, వసతి గృహాలు, ధర్మశాలల నుంచి ఎప్పటికప్పుడు పోలీసులు సమాచారం సేకరిస్తున్నారు. ఎలాంటి అనుమానం తలెత్తినా, చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు.

ఢిల్లీవ్యాప్తంగా ఆంక్షలు విధించారు. మెట్రో సేవల్లో మార్పులు చేశారు. ట్రాఫిక్​ ఆంక్షలను తెలియజేస్తూ ఢిల్లీ పోలీసులు ట్వీట్​ చేశారు.

కొవిడ్​ నిబంధనలు..

దేశాన్ని కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ గడగడలాడిస్తోంది. గణతంత్ర వేడుకలపైనా ఈ ప్రభావం పడింది. 15ఏళ్ల లోపు పిల్లలు, టీకా రెండు డోసులు తీసుకోని వారు పరేడ్​లో పాల్గొనకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.  ​మిగిలిన వారు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరాన్ని పాటించాలని తెలిపారు. టీకా సర్టిఫికెట్లు తీసుకురావాలని స్పష్టం చేశారు.

రాష్ట్రపతి ప్రసంగం..

73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మంగళవారం సాయంత్రం.. రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​ జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు.

 

తదుపరి వ్యాసం