తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Yellow Alert For Bengaluru: బెంగళూరుకు మళ్లీ వర్షం ముప్పు

Yellow alert for Bengaluru: బెంగళూరుకు మళ్లీ వర్షం ముప్పు

HT Telugu Desk HT Telugu

11 October 2022, 22:07 IST

    • Yellow alert for Bengaluru: కర్నాటకను, ముఖ్యంగా బెంగళూరును వరుణ దేవుడు వదలడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా, ముఖ్యంగా బెంగళూరులో బుధవారం మళ్లీ భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ హెచ్చరించింది.
బెంగళూరులో వర్షం
బెంగళూరులో వర్షం (Raj K Raj/HT Photo)

బెంగళూరులో వర్షం

Yellow alert for Bengaluru: కర్నాటకలో వర్ష బీభత్సం కొనసాగుతోంది. తాజాగా, వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. దక్షిణ కన్నడ, ఉడిపి, ఉత్తర కన్నడ, బెలగావి, బీదర్, ధార్వాడ్, గడగ్, కలబురిగి, రాయిచూర్, కొడగు, శివమొగ్గ సహా దాదాపు రాష్ట్రమంతా రానున్న రెండు రోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి
ట్రెండింగ్ వార్తలు

Monsoon: దేశంలోకి రుతుపవనాలు ప్రవేశించడంపై కీలక ప్రకటన చేసిన ఐఎండీ

Fact Check: రాహుల్ గాంధీని ప్రశంసిస్తూ ఎల్.కే.అడ్వాణీ ఈ వ్యాఖ్యలు చేయలేదు

Crime news: స్కూల్ లో బాలికపై అత్యాచారం; దారుణం చేసింది స్కూల్ ఓనరే; అతడికి సహకరించిన ఏఎస్సై

UK Graduate Visa: హైయర్ స్టడీస్ కు యూకే వెళ్లే స్టుడెంట్స్ కు గుడ్ న్యూస్; గ్రాడ్యుయేట్ వీసాపై కీలక అప్ డేట్

Yellow alert for Bengaluru: బెంగళూరుకు యెల్లో అలర్ట్

బెంగళూరు నగర ప్రజలకు కూడా ప్రత్యేక హెచ్చరికలను వాతావరణ శాఖ, కర్నాటక నేచురల్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సెంటర్ జారీ చేశాయి. బెంగళూరు అర్బన్, బెంగళూరు రూరల్ జిల్లాల్లో బుధవారం భారీ వర్షాలు కురిసే ప్రమాదముందని హెచ్చరించాయి. లోతట్లు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరకోవాలని సూచించాయి. బెంగళూరు నగర ప్రజలు అవసరమైతేనే, బయటకు రావాలని సూచించింది.

Yellow alert for Bengaluru: పాండవపురలో అత్యధికం..

కర్నాటకలో మంగళవారం అత్యధిక వర్షపాతం పాండవపుర తాలూకాలోని నారాయణ పురలో 128 మిమీలు, హసన్ జిల్లాలోని అర్కాల గూడలో 123 మిమీ, మైసూరు జిల్లా కృష్ణరాజనగర్ లో 116.5 మిమీల వర్షపాతం నమోదైంది.

తదుపరి వ్యాసం