HDFC Bank posts 22.30% jump in Q2: Q2 లో HDFC Bank కు భారీ లాభాలు
15 October 2022, 16:37 IST
- HDFC Bank posts 22.30% jump in Q2: సెప్టెంబర్ నెలతో ముగిసే ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్ భారీ లాభాలను ఆర్జించింది.
ప్రతీకాత్మక చిత్రం
HDFC Bank posts 22.30% jump in Q2: ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ఫలితాలను HDFC Bank శనివారం ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంతో పోలిస్తే, ఈ సంవత్సరం HDFC Bank 22.30% ఎక్కువ లాభాలను ఆర్జించింది.
HDFC Bank posts 22.30% jump in Q2: 11 వేల కోట్లు..
సెప్టెంబర్ తో ముగిసే క్యూ2లో HDFC Bank రూ. 11,125.21 కోట్ల రూపాయల నెట్ ప్రాఫిట్ సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో HDFC Bank నెట్ ప్రాఫిట్ రూ. 9,096.19 కోట్లు మాత్రమే. HDFC Bank భారత్ లో అతిపెద్ద ప్రైవేటు సెక్టార్ బ్యాంక్ గా ఉంది.
HDFC Bank posts 22.30% jump in Q2: మొత్తం ఆదాయం రూ. 45 వేల కోట్లు
2022-23 ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో HDFC Bank మొత్తం ఆదాయం రూ. 46,182 కోట్లు కాగా, గత సంవత్సరం ఇదే కాలానికి HDFC Bank రూ. 38,754 కోట్ల ఆదాయం సముపార్జించింది. అలాగే, ఖర్చులు కూడా గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 22,947 కోట్లు కాగా, ఈ సంవత్సరం క్యూ 2లో అవి రూ. 28,790 కోట్లుగా నమోదయ్యాయి.