తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Hdfc Bank Rate Hikes: మరో 0.35 శాతం వడ్డీరేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HDFC Bank rate hikes: మరో 0.35 శాతం వడ్డీరేటు పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్

HT Telugu Desk HT Telugu

07 June 2022, 15:16 IST

    • కొద్ది రోజుల వ్యవధిలోనే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు మరోసారి వడ్డీ రేట్లు పెంచేసింది.
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ముందు ఖాతాదారుల క్యూ (ఫైల్ ఫోటో)
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ముందు ఖాతాదారుల క్యూ (ఫైల్ ఫోటో) (REUTERS)

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల ముందు ఖాతాదారుల క్యూ (ఫైల్ ఫోటో)

ముంబై, జూన్ 7: దేశంలో అత్యంత పెద్దదైన ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ మరో 0.35 శాతం వడ్డీ రేటు పెంచుతూ మంగళవారం నిర్ణయం తీసుకుంది.

రేపు ఆర్‌బీఐ తన మానిటరీ పాలసీ రివ్యూ ప్రకటన నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్లు పెంచేసింది. కొద్ద రోజుల వ్యవధిలోనే వడ్డీ రేట్లు పెంచడం ఇది రెండోసారి. రెండుసార్లు కలిపి మొత్తంగా 0.60 శాతం మేర వడ్డీ రేట్లు పెరిగినట్టయింది. 

మే మాసంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకస్మాత్తుగా, అనూహ్యంగా 0.40 శాతం మేర వడ్డీ రేట్లు పెంచిన సంగతి తెలిసిందే. దేశంలో ద్రవ్యోల్భణానికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్న ఆర్బీఐ.. జూన్ 8న అంటే బుధవారం ఉదయం మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండింగ్ బేస్డ్ లెండింగ్ రేట్(ఎంసీఎల్ఆర్) 0.35 శాతం పెంచిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్.. నేటి నుంచి ఈ వడ్డీ రేట్లు అమల్లోకి వస్తాయని తెలిపింది. 

కన్జ్యూమర్ లోన్లపై ఒక ఏడాది ఎంసీఎల్ఆర్ ఆధారిత వడ్డీ రేట్లు ఇప్పటివరకు 7.50 శాతం ఉండగా.. ఇకపై 7.85 శాతం వర్తిస్తుందని తెలిపింది.

ఓవర్ నైట్ ఎంసీఎల్ఆర్ 7.15 శాతం ఉండగా.. ఇకపై 7.50 శాతం ఉంటుందని తెలిపింది. ఇక మూడేళ్ల ఎంసీఎల్ఆర్ 7.70 శాతంగా ఉండగా.. ఇకపై 8.05 శాతం ఉంటుందని తెలిపింది.

క్రెడిట్ గ్రోత్ ఎక్కువగా లేని ఈ పరిస్థితుల్లో వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాలు రావడం గమనార్హం. వడ్డీ రేట్ల పెంపుతో పాటు డిపాజిట్లపై వడ్డీ రేట్లు కూడా పెరుగుతున్నాయి. పాలసీ మార్పులు కూడా వీటికి తోడవుతున్నాయి.

టాపిక్

తదుపరి వ్యాసం