HCL recruitment: హెచ్ సీ ఎల్ లో ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ ల భర్తీకి నోటిఫికేషన్
27 January 2024, 14:02 IST
HCL recruitment: గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. గేట్ స్కోర్ ద్వారా ఈ పోస్ట్ లను భర్తీ చేయనున్నారు.
ప్రతీకాత్మక చిత్రం
గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టుల భర్తీకి హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు హెచ్ సీ ఎల్ అధికారిక వెబ్ సైట్ hindustancopper.com ద్వారా ఆన్ లైన్ లో అప్లై చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 29వ తేదీ న ప్రారంభమవుతుంది. ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఫిబ్రవరి 19 వ తేదీగా నిర్ణయించారు. గేట్ స్కోర్ ఆధారంగా రిక్రూట్మెంట్ ఉంటుంది.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ 2024: ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 40 ఖాళీలను భర్తీ చేయనుంది.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ అర్హతలు: దరఖాస్తుదారుడు 2021 / 2022 / 2023 సంవత్సరాల్లో గేట్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. 2021 / 2022 / 2023 చెల్లుబాటు అయ్యే గేట్ స్కోరు కలిగి ఉండాలి.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ వయోపరిమితి: హెచ్ సీ ఎల్ లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్ట్ లకు అప్లై చేసే అభ్యర్థులకు కనీస వయస్సు 28 సంవత్సరాలుగా నిర్ణయించారు.
హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్ దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.500 నాన్ రిఫండబుల్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. మిగతా కేటగిరీల అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించనవసరం లేదు.
హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్ ఎంపిక ప్రక్రియ: గ్రాడ్యుయేట్ ఇంజినీర్ ట్రైనీ పోస్ట్ లకు గేట్ స్కోర్, పర్సనల్ ఇంటర్వ్యూ అనే రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. గేట్ స్కోర్ కు 70 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూ కు 30 శాతం వెయిటేజీ ఉంటాయి.